మోదీ ముందుకు వెళతారా? మొహం చెల్లుతుందా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అఖల పక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. మోదీ నుంచి జవాబు వచ్చిన తర్వాతనే [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అఖల పక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. మోదీ నుంచి జవాబు వచ్చిన తర్వాతనే [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అఖల పక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. మోదీ నుంచి జవాబు వచ్చిన తర్వాతనే అఖిలపక్షం సంగతి తేలుతుంది. ఒకవేళ అఖిలపక్షంతో భేటీకి మోదీ సుముఖత వ్యక్తం చేస్తే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అందరూ కలసి జగన్ నేతృత్వంలో వెళతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే మోదీ అఖిలపక్షంతో కలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
హోదా విషయంలోనూ….
నిజానికి గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు. అప్పట్లో విపక్షాలన్నీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఆయన ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపారు. చివరకు ప్రత్యేక హోదా ఎటూ కాకుండా పోయింది. దాని ఫలితం చంద్రబాబు 2019 ఎన్నికలలో అనుభవించారు. ఇప్పుడు జగన్ ఆ పొరపాటు చేయదలచుకోలేదు. తాను అఖిలపక్షంతో వస్తానని అపాయింట్ మెంట్ ఇవ్వాలని మోదీకి లేఖ రాశారు.
బాబు వస్తారా?
చంద్రబాబు జగన్ నేతృత్వంలో ప్రధాని మోదీని కలసేందుకు వెళతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మోదీతో చంద్రబాబుకు చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడిప్పుడే బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ తో కలసి నడవగలరా? అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అఖిలపక్షానికి మోదీ అనుమతిస్తే పార్టీ తరుపున అచ్చెన్నాయుడును పంపే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
పవన్ కలసి నడుస్తారా?
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. జగన్ నేతృత్వంలో మోదీని కలిసేందుకు పవన్ అస్సలు ఇష్టపడరు. దీనికి తోడు మోదీ అపాయింట్ మెంట్ తనకు ఇవ్వకపోవడంపై కూడా పవన్ గుర్రుగా ఉన్నారు. ఈయన కూడా తన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ ను పంపే అవకాశముంది. ఇలా చూసుకుంటే జగన్ తో కలసి వెళ్లేందుకు ప్రధాన పార్టీల నేతలు ఎవరూ ఇష్టపడటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నా మోదీ ముందుకు వెళ్లడానికి మాత్రం వీరికి మొహం చెల్లడం లేదు.