ఇప్పుడు రేవంత్ టీడీపీకి శత్రువుగా మారారే?

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇక చాపచుట్టేసినట్లే. ఇప్పటి వరకూ కొద్దో గొప్పో తిరిగి పుంజుకుంటామన్న ఆ ఆశలు కూడా అడుగంటి పోయినట్లే. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా [more]

Update: 2021-07-19 03:30 GMT

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇక చాపచుట్టేసినట్లే. ఇప్పటి వరకూ కొద్దో గొప్పో తిరిగి పుంజుకుంటామన్న ఆ ఆశలు కూడా అడుగంటి పోయినట్లే. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లినట్లేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉన్న క్యాడర్ + ఓటు బ్యంకు అంతా ఇప్పుడు కాంగ్రెస్ కు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టీడీపీ క్యాడర్ నుంచే…..

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన తెలుగుదేశం పార్టీ నేతగానే పసుపు పార్టీ క్యాడర్ ఇప్పటికీ చూస్తుంది. రేవంత్ రెడ్డికి పదవి రాగానే ఆయన అభిమానుల హడావిడిని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నేతలు అభినందనలే ఎక్కువగా విన్పించాయి. టీడీపీ సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్సు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావాలని కోరుకున్న వారిలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు.

అసలే పార్టీ అంతంత మాత్రం….

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కార్యకర్తలతో సమావేశం కూడా అయ్యారు. అయితే ఆ తర్వాత ఎల్. రమణ సైలెంట్ అయిపోయారు. దీనికి తోడు చంద్రబాబు కూడా తెలంగాణ టీడీపీని పట్టించుకోవడంలేదు. ఆయన ఏపీ మీదనే దృష్టి పెట్టారు. భవిష్యత్ లో కూడా చంద్రబాబు తెలంగాణ టీడీపీకి ఆర్థిక సాయం కూడా అందించడం కష్టమే.

రేవంత్ వెంట…

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో రానున్న కాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముంది. ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ కి మిగిలిన ఉన్న ఓటు బ్యాంకు కూడా రేవంత్ తీసుకు వెళతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం తెలంగాణ టీడీపీని పూర్తిగా కనుమరుగు చేస్తుందంటున్నారు.

Tags:    

Similar News