కమ్మ నేతలకు ఊపిరిచ్చిన అమరావతి
గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నసంగతి తెలిసిందే. పార్టీ ఏదైనా ఇక్కడ వారి ఆధిపత్యం మాత్రం నడుస్తోంది. దశాబ్దాల కాలం నుంచి వారే [more]
గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నసంగతి తెలిసిందే. పార్టీ ఏదైనా ఇక్కడ వారి ఆధిపత్యం మాత్రం నడుస్తోంది. దశాబ్దాల కాలం నుంచి వారే [more]
గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్నసంగతి తెలిసిందే. పార్టీ ఏదైనా ఇక్కడ వారి ఆధిపత్యం మాత్రం నడుస్తోంది. దశాబ్దాల కాలం నుంచి వారే గుంటూరు రాజకీయాలని శాసిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన కమ్మ నేతల డామినేషన్ చాలా ఎక్కువ. 2014లో టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో కమ్మ నేతలదే పెత్తనం. ఇంకా చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా కమ్మల పెత్తనమే సాగుతూ వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో టీడీపీ కమ్మ నేతలు ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. జిల్లాలో మొత్తం 10 మంది కమ్మలు పోటీ చేస్తే లోకేష్‌తో సహా అందరూ ఓడిపోయారు.
జయదేవ్ మినహా….
గుంటూరు ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ మినహా టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ కమ్మ నేత కూడా గెలవకుండా చిత్తుగా ఓడారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు ( ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) గెలిచినా కూడా జిల్లాలో వారి హవా నడవడం లేదు. వారి కంటే రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలదే డామినేషన్ నడుస్తోంది. టీడీపీ తరుపున ఓడిపోయిన కమ్మ నేతలు ఒక్కసారిగా పుంజుకోవడం మొదలుపెట్టారు. ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేయడం కావొచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు ఫెయిల్ కావడం కావొచ్చు, ఏడాది సమయంలోనే జిల్లాలో కమ్మ నేతలకు పుంజుకునే ఛాన్స్ దక్కింది. ముఖ్యంగా ఈ కమ్మ నేతలకు అమరావతి ఊపిరిచ్చిందనే చెప్పొచ్చు.
మూడు రాజధానుల నిర్ణయంతో…..
జగన్ అమరావతిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం దానికి గుంటూరు నేతలు కూడా తలాడించడంతో, ఇక్కడి ప్రజల్లో వైసీపీపై చాపకింద నీరులా వ్యతిరేకిత మొదలైంది. పైకి వైసీపీ నాయకులు డాంబికాలు పోతున్నా లోపల మాత్రం రాజధాని తరలింపు వారిలో కూడా తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అలాగే టీడీపీ వాళ్ళు అమరావతి కోసం పోరాటం చేయడంతో పరిస్థితి మారిపోయింది. కమ్మ నేతలు కూడా దూకుడుగా అమరావతి కోసం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, వినుకొండలో జివి ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావులకు అమరావతి బాగా ప్లస్ అవుతుంది.
లోకేష్ కూ కలసి వస్తుందా?
ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌కు అమరావతి బాగా కలిసొస్తోంది. ఇక్కడ ప్రజల్లో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కనపడని వ్యతిరేకత ఉంది. జగన్ అమరావతిని పట్టించుకోకుండా విశాఖ వైపు వెళితే గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలకు మైనస్ అవ్వడం ఖాయం. అలాగే టీడీపీ నేతలకు బాగా ప్లస్ అవుతోంది. వాస్తవంగా గత ఎన్నికల్లో జగన్ జిల్లాలో సోషల్ ఇంజనీరింగ్ పాటించి కమ్మలకు మిగిలిన కులాలను చాలా వరకు దూరం చేసి ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచారు. దీంతో ఇప్పటి వరకు బయటకు వచ్చి జనాల్లోకి వెళ్లేందుకే సాహసించని ఈ కమ్మ నేతల రాజకీయ భవిష్యత్తుకు అమరావతి కొత్త ఊపిరి లూదిందనే చెప్పాలి.