రాష్ట్రాలను పాలించేలా…?

రాజకీయాల్లో మహిళల పాత్ర నేటీకి నామ మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మంత్రి వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదాహారణకు 2014 [more]

Update: 2019-09-11 16:30 GMT

రాజకీయాల్లో మహిళల పాత్ర నేటీకి నామ మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మంత్రి వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదాహారణకు 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అయిదేళ్లపాటు ఒక్క మహిళా మంత్రి లేరు. ఇలాంటి రాష్ట్రాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు అన్యాయమే జరుగుతుంది. వారికి అరకొర ప్రాతినిధ్యం లభిస్తోంది. కీలకమైన రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల పదవుల్లోనూ నారీమణుల సంఖ్య నామమాత్రమే. ఒక్క ప్రతిభాపాటిల్ మాత్రమే రాష్ట్రపతి అయ్యారు.

ఉప రాష్ట్రపతి పదవి…..

ఉపరాష్ట్రపతి పదవి ఇంతవరకు మహిళలను వరించలేదు. రాష్ట్రాల ప్రథమ పౌరులైన గవర్నర్ల విషయంలో కొంత పరవాలేదని చెప్పవచ్చు. తాజాగా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళసై నిన్నటి దాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు.రెండు సార్లు అసెంబ్లీ, రెండు సార్లు పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో తుత్తుకుడి నుంచి పోటీ చేసి డిఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఒకప్పటి కాంగ్రేస్ నేత కుమారి అనంతన్ కుమార్తె అయిన తమిళసై వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె ప్రమాణ స్వీకారంతో దేశంలో మహిళా గవర్నర్ల సంఖ్య 8కి పెరిగింది.

మహిళా గవర్నర్లుగా…..

వీరిలో కిరణ్ బేడీ పుదుచ్ఛేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ దేశంలో ఐపీఎస్ అధికారిగా చరిత్ర సృష్టించిన ఆమె గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో 2016 మే నెలలో ఆమెను పుదుచ్ఛేరి గవర్నర్ గా నియమించారు. గతంలో ఎలా ఉన్నప్పటికీ మోదీ హయాంలో మహిళలకు గవర్నర్ పదవులు అధికంగా వస్తున్నాయనడంలో సందేహం లేదు. 2014 మే నెలలో అధికారంలోకి రాగానే మృదులా సిన్హాను గోవా గవర్నర్ గా నియమించారు. 1942 నవంబర్ 27న జన్మించిన ఆమె మంచి రచయిత. బిహార్ కు చెందిన 77 సంవత్సరాల సిన్హా ఇప్పటికీ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఎలాంటి వావాదాలు లేకుండా పదవిని నిర్వహిస్తున్నారు. ద్రౌపదీ ముర్ము 2015 మేలో జార్ఖండ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారు. ఆమె ఒడిశాలోని మయర్ భంజ్ కు చెందినవారు . గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నజ్మా హెప్తుల్లా 2016 ఆగస్టు 21న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఇప్పటికీ కొనసాగుతున్నారు. 1980 లోనే ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. 17 సంవత్సరాల పాటు ఆమె రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా పనిచేసి రికార్డు సృష్టించారు. దేశ తొలి విద్యామంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనవరాలు ఆమె. సుదీర్ఘకాలం క్యాబినెట్ లో పనిచేసిన ఆమె చివరి రోజుల్లో బీజేపీలో చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె చివరి రోజుల్లో బీజేపీలో చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీ బెన్ పటేల్ 2018 జనవరిలో మధ్యప్రదేశ్ ఆ తర్వాత ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులయ్యారు. అనంతరం దేశంలో కీలక రాష్ట్రమైన యూపీ గవర్నర్ గా కొనసాగుతున్నారు. 2014లో గుజరాత్ నుంచి మోదీ ప్రధానిగా ఎన్నికవడంతో ఆయన స్థానంలో ఆనందీబెన్ నియమితులయ్యారు.ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ గవర్నర్ గా కొనసాగుతున్నారు. యూపీకి చెందిన ఆమె గతంలో ఆగ్రా మేయర్ గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. రాష్ట్రానికి ఆమె పదో గవర్నర్. చత్తీస్ గఢ్ గవర్నర్ గా ఈ ఏడాది జులైలో అనసూయ ఉకే నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన అనసూయ ఉకే 1957 ఏప్రిల్ లో జన్మించారు. ఈమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

సరోజనీ నాయుడు తొలి గవర్నర్ గా…..

సరోజినీ నాయుడు మొట్టమొదటి మహిళా గవర్నర్. స్వాతంత్రం అనంతరం 1947 ఆగస్టు 15 నుంచి 1949 మార్చి 2 వరకు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ గవర్నర్ గా పనిచేశారు. ఆమె కూతురు పద్మజా నాయుడు ఏకంగా 11 సంవత్సరాలపాటు గవర్నర్ గా పనిచేసి రికార్డు సృష్టించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ గా వ్యవహరించారు. 1962లో నాటి ప్రధాని నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. 1977లో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా నియమితులైన శారదా ముఖర్జీ నాలుగో గవర్నర్. తెలుగు వారైన వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక గవర్నర్ గా పనిచేశారు. ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా తెలుగువారైన బండారు దత్తాత్రేయ వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా పదవీ విరమణ చేశారు. ఏపీకి చెందిన వారు కూడాగతంలో చాలామంది గవర్నర్లుగా పనిచేశారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News