అందరి చూపూ ఆ దేశంవైపే?

యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. అమెరికా వంటి అగ్రరాజ్యం సయితం కరోనా వైరస్ విషయంలో చేతులెత్తేసిందనే చెప్పాలి. ఇక చిన్న దేశాల నుంచి [more]

Update: 2020-06-13 18:29 GMT

యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. అమెరికా వంటి అగ్రరాజ్యం సయితం కరోనా వైరస్ విషయంలో చేతులెత్తేసిందనే చెప్పాలి. ఇక చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకూ కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. మరో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారితో కలసి జీవించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. అందుకే లాక్ డౌన్ లు ఎత్తి వేసి మరీ అనేక దేశాలు సాధారణ జీవనాన్ని ప్రారంభించాయి. దీంతో రోజురోజుకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

చిన్నదేశమైనా….?

అయితే అతి చిన్న దేశమైన న్యూజిల్యాండ్ మాత్రం కరోనా నుంచి బయటపడింది. ప్రపంచంలోనో కరోనా ఫ్రీ దేశంగా అరుదైన రికార్డును న్యూజిల్యాండ్ సాధించింది. దీని జనాభా యాభై లక్షలు మాత్రమే. అందుకే ఇది సాధ్యపడిందంటున్నారు నిపుణులు. జనసాంద్రత తక్కువగా ఉండటంతో పాటు విసిరేసి ఉండేటట్లు ఉండే దేశం కావడంతో త్వరగా కరోనా వైరస్ నుంచి న్యూజిల్యాండ్ బయటపడిందటున్నారు.

ప్రపంచంలోని అన్ని దేశాలూ….

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ న్యూజిల్యాండ్ వైపు చూస్తున్నాయి. అక్కడ అమలు చేసిన విధానంపై అథ్యయానికి రెడీ అయిపోయాయి. కరోనా వైరస్ ను కేవలం ఏడు వారాల్లోనే తరిమిగొట్టడం వెనక ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. కఠినతరమైన ఆంక్షలు న్యూజిల్యాండ్ నుంచి కరోనా వైరస్ ను తరిమికొట్టడం సాధ్యమయిందంటున్నారు. కరోనా వైరస్ కు ఎటువంటి మందు కనిపెట్టకముందే న్యూజిల్యాండ్ కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగింది.

ఏం మంత్రం వేశారో?

న్యూజిల్యాండ్ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్ పట్టుదల గల మనిషి. ఫిబ్రవరిలోనే ఆమె చైనాతో రాకపోకలను నిషేధించారు. మార్చి 15వ తేదీ నాటికి న్యూజిల్యాండ్ లో కేవలం 100 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత కఠినతరమైన ఆంక్షలు విధించారు. ఏడు వారాల పాటు లాక్ డౌన్ ను పకడ్బందీగా నిర్వహించారు. ఇటీవల యాక్టివ్ కేసుగా ఉన్న చివరి వ్యక్తి కూడా కరోనా నుంచి కోలుకోవడంతో కరోనా ఫ్రీ దేశంగా న్యూజిల్యాండ్ అవతరించింది. ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Tags:    

Similar News