టిడిపికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్

వైసిపి ఎన్నికల హామీలను టిడిపి ఎన్నికల ముందు అమల్లో పెడుతుండటంతో జగన్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దీనికి విరుగుడు కోసం కసరత్తు చేసిన వైఎస్ జగన్ [more]

Update: 2019-02-07 03:40 GMT

వైసిపి ఎన్నికల హామీలను టిడిపి ఎన్నికల ముందు అమల్లో పెడుతుండటంతో జగన్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దీనికి విరుగుడు కోసం కసరత్తు చేసిన వైఎస్ జగన్ కొత్త వ్యూహంతో ప్రజల్లోకి వచ్చారు. అందులో ముఖ్యమైంది వృద్ధులకు ఇచ్చే పెన్షన్. దీనిని టిడిపి సర్కార్ వెయ్యి రూపాయల నుంచి రెండువేలరూపాయలు చేయడంతో గతంలో తాను ఇచ్చిన హామీని సవరించారు జగన్. వైసిపి అధికారంలోకి వస్తే రెండువేల రూపాయల పెన్షన్ మూడు వేలరూపాయలు చేస్తామని తిరుపతి లో ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో ప్రకటించి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు.

ఓటర్లపై వరాల జల్లులు …

సుదీర్ఘ పాదయాత్ర తరువాత నిర్వహించిన శంఖారావ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వెల్లువెత్తారు. ఈ సభను వేదికగా చేసుకుని వరాల జల్లే కురిపించారు వైసిపి చీఫ్. డ్వాక్రా మహిళలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. నిరుద్యోగులకు భృతిని అందిస్తామని, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల వైద్య సేవాలు ఉచితంగా అందిస్తామని చెప్పుకొచ్చారు. టిడిపి ప్రభుత్వంలా ఎన్నికల ముందు తాము పనులు చేయమని ఐదేళ్ళు ప్రజల ఆశలకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. రేణిగుంట లో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో వైసిపి క్యాడర్ లో ఆనందం వెల్లివిరుస్తుంది. దాంతో బాటు జగన్ నేరుగా సర్కార్ ఇటీవల ఇచ్చిన హామీలను సమర్ధవంతంగా తిప్పికొట్టి అంతకు మించి ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం పట్ల ఆ పార్టీ వర్గాల్లో జోష్ పెరగడం విశేషం.

Tags:    

Similar News