యడ్డీకి… లాస్ట్ ఛాన్స్…!!
అవును.. యడ్యూరప్పకు ఈ ఎన్నికలు కీలకమే. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్ప రాజకీయ జీవితం ఎటువైపు అన్నది తేలనుంది. కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా [more]
అవును.. యడ్యూరప్పకు ఈ ఎన్నికలు కీలకమే. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్ప రాజకీయ జీవితం ఎటువైపు అన్నది తేలనుంది. కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా [more]
అవును.. యడ్యూరప్పకు ఈ ఎన్నికలు కీలకమే. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్ప రాజకీయ జీవితం ఎటువైపు అన్నది తేలనుంది. కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానాల సంఖ్యను బట్టి యడ్యూరప్ప ఆశలు నెరవేరనున్నాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా యడ్యూరప్ప పైనే ఆధారపడి ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం నేత కావడంతో ఆయన నాయకత్వాన్ని ఇప్పటి వరకూ కేంద్ర నాయకత్వం అంగీకరిస్తూ వచ్చింది.
కేంద్ర నాయకత్వం సహకరించినా…
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకున్నా.. యడ్డీ బలవంతంమీదే ఆయనను ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం చేసేందుకు కేంద్ర పార్టీ నాయకత్వం అంగీకరించిందంటారు. అయితే ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. ఇప్పటికే 70వ వడిలో పడిన యడ్యూరప్ప ఎలాగైనా కన్నడ సీమను ఒకసారి ఏలాలని కలలు గంటున్నారు. లోక్ సభ ఫలితాలు వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే యడ్డీ కలలు సాకారం అయ్యే అవకాశముంది.
ఫలితాలను బట్టే….
కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలన్నది కూడా కేంద్ర నాయకత్వం ఆలోచన. అందుకు కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా, ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా యడ్యూరప్ప ఆశలు నెరవేరవన్నది బీజీపీ నుంచి జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే సంకీర్ణ సర్కార్ లో ఉన్న అసంతృప్తులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆపరేషన్ కమల్ ను ప్రారంభించవచ్చు.
ఫుల్ స్టాప్ పడుతుందా…?
ఇక కేంద్రంలో బీజేపీ రాకపోతే యడ్యూరప్ప రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్పను ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉండటంతో ఆయనను తప్పించడం అనివార్యమే. ఇటు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు లేక, అటు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే పార్టీలో యడ్యూరప్ప రోల్ ఏంటన్న చర్చ ఇప్పటినుంచే మొదలయింది. మొత్తం మీద యడ్యూరప్ప కు ఈలోక్ సభ ఎన్నికల ఫలితాలు మార్గాన్ని నిర్దేశించనున్నాయి.