ఈయన అవసరం ఇక లేదట

సీనియర్ నేత యనమల రామకృష్ణుడును తెలుగుదేశం పార్టీ పూర్తిగా సైడ్ లైన్ చేసిందా? ఆయనను చంద్రబాబు ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదా? అంటే అవుననే అంటున్నారు. [more]

Update: 2021-02-07 05:00 GMT

సీనియర్ నేత యనమల రామకృష్ణుడును తెలుగుదేశం పార్టీ పూర్తిగా సైడ్ లైన్ చేసిందా? ఆయనను చంద్రబాబు ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదా? అంటే అవుననే అంటున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, 2019 ఎన్నికల ఓటమి అనంతరం యనమల రామకృష్ణుడుకు పార్టీలో నెంబర్ 2గానే ఉన్నారు. సీనియర్ నేత కావడంతో ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యనమల రామకృష్ణుడు సలహాలు, సూచనలు తీసుకునే వారు.

అప్పుడు పొగిడి…..

శాసనమండలిలో మూడు రాజధానుల అంశం వీగిపోవడం వెనక యనమల రామకృష్ణుడు రచించిన వ్యూహమే కారణమని చంద్రబాబు ఆయనపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతల సేవలు పార్టీకి అవసరమని చంద్రబాబు పదే పదే చెప్పారు. కానీ గత ఆరు నెలల నుంచి చంద్రబాబు యనమల రామకృష్ణుడు సలహాలను పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

అప్పటి నుంచే….

ప్రధానంగా రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్న నాటి నుంచి యనమల రామకృష్ణుడును పట్టించుకోవడం లేదట. పార్టీ పదవుల భర్తీలోనూ యనమల రామకృష్ణుడు ప్రమేయం లేదని చెబుతున్నారు. ఆయన సొంత జిల్లలో కూడా యనమల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలే దంటున్నారు. ఇక రామతీర్థం ఘటన, ఆ తర్వాత హిందుత్వ నినాదాలను అందుకోవడం, క్రిస్టియన్లపై వ్యాఖ్యలు వంటి వాటిపై యనమల రామకృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఇటీవల పార్టీ నిర్ణయాలపై….?

ఇప్పుడిప్పుడే జగన్ నుంచి క్రిస్టియన్లు, ముస్లింలు టీడీపీ వైపు చూస్తున్నారని, ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాగే ఉంటే పార్టీ అన్ని వర్గాలకు దూరమవుతుందని యనమల సీనియర్ నేతల వద్ద ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచరం. మరోవైపు లోకేష్ సయితం తొలి నుంచి యనమల రామకృష్ణుడుకు దూరంగానే ఉంటున్నారు. లోకేష్ చినరాజప్ప వంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టోటల్ గా యనమల అవసరం ఇప్పుడు పార్టీకి లేనట్లే తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News