య‌ర‌ప‌తినేనికి భ‌లే క‌లిసొస్తున్నాయిగా…?

టీడీపీ సీనియ‌ర్ నేత‌, గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు తాజా రాజ‌కీయ ప‌రిణామాలు భ‌లే క‌లిసివ‌స్తున్నాయి. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం [more]

Update: 2020-11-27 14:30 GMT

టీడీపీ సీనియ‌ర్ నేత‌, గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు తాజా రాజ‌కీయ ప‌రిణామాలు భ‌లే క‌లిసివ‌స్తున్నాయి. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి య‌ర‌ప‌తినేని వ‌రుస‌గా రెండుసార్లు… మొత్తంగా మూడోసారి విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయ‌న ఫుల్ స్వింగ్‌లో ఉండేవారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ, జ‌గ‌న్ హ‌వాలో కాసు మ‌హేష్‌రెడ్డిపై ఆయ‌న ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ దూకుడు, క‌క్ష సాధింపు కేసులు కూడా య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుపై ఎక్కువ య్యాయి.

కలసి వస్తున్న అంశాలివే….

దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. అడ‌పాద‌డ‌పా కార్యక్రమాలు నిర్వహించారే తప్ప పెద్ద ఊపు క‌నిపించ‌లేదు. రెండున్నర ద‌శాబ్దాలుగా పైగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నేత‌గా ఉన్న ఆయ‌న చివ‌ర‌కు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున అభ్యర్థుల‌ను కూడా నిల‌బెట్టలేదంటే ప‌ల్నాడులో వైసీపీ నేత‌ల బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమ‌వుతోంది. కానీ, అనూహ్యంగా స‌ర్కారు చేస్తున్న కొన్ని త‌ప్పులు.. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న పొర‌పాటు రాజ‌కీయాలు.. స్థానిక స‌మ‌స్యలు, ప్రజ‌ల డిమాండ్లు వంటివి ఇప్పుడు య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకి క‌లిసి వ‌స్తున్నాయి. కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ప్రస్తుతం జ‌గ‌న్ స‌ర్కారు జిల్లాల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా భావించింది. ఈ క్రమంలోనే ప‌ల్నాడు కేంద్రంగా న‌ర‌స‌రావు పేట జిల్లాను ఏర్పాటు చేయాల‌ని వైసీపీ నాయ‌కులు ప్రయ‌త్నిస్తున్నారు.

గురజాల జిల్లా కేంద్రంగా….

అయితే, కొన్ని ద‌శాబ్దాలుగా.. మాత్రం గుర‌జాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ ఉంది. గుర‌జాల‌కు శ‌తాబ్దాల చ‌రిత్ర ఉంది. ప‌ల్నాటి యుద్ధానికి గుర‌జాల ముఖ్య భూమిక‌. నాడు గుర‌జాల – మాచ‌ర్ల రాజ్యాల మ‌ధ్యే ప‌ల్నాటి యుద్ధం జ‌రిగింది. ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న గుర‌జాల జిల్లా సెంటిమెంట్ డిమాండ్‌ను స‌ర్కారు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్లుగా గుర‌జాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఉద్యమం చేస్తున్నారు. విస్తృతంగా ప‌ర్యటిస్తూ.. గుర‌జాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు అంద‌రినీ స‌మీక‌రిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న సెంట‌ర్ గా గుర‌జాల రాజ‌కీయాలు మారిపోయాయి.

ఎంత వరకూ ….?

ఇక‌, గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేయ‌క‌పోవ‌డం మైన‌స్ అయ్యింది. ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఒక‌టి రెండు కూడా నెర‌వేర‌లేదు. ఇక కాసు మ‌హేష్‌రెడ్డి స్థానికంగా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు స‌రికదా.. సొంత పార్టీ నేత‌ల్లో ఆయ‌న‌పై తీవ్ర అసంతృప్తి ఉంది. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి వ‌ర్గాన్ని ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైసీపీ రెండు గ్రూపులుగా చీలింది. గ‌త ఐదేళ్లలో టీడీపీలో చ‌క్రం తిప్పిన వాళ్లకు ఇప్పుడు వైసీపీ కండువాలు క‌ప్పి వాళ్ల క‌నుస‌న్నల్లోనే కాసు రాజ‌కీయం న‌డిపిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో కాసును అప్పుడే తీవ్ర అస‌మ్మతి చుట్టేసింది. ఈ ప‌రిణామాల‌తో ప్రజ‌ల్లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుపై పాజిటివ్ టాక్ వ‌చ్చేలా చేసింది. మ‌రి దీనిని ఆయ‌న ఎంత వ‌ర‌కు యూజ్ చేసుకుని కాసుకు చెక్ పెడ‌తారో ? చూడాలి.

Tags:    

Similar News