గోదాట్లో కలిపేసినట్లేనా?
ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా చిన్నచూపేనా అన్న ప్రశ్న ఆ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి రాజేస్తోంది. పన్నులు వసూలు చేసుకునే కర్మాగారం [more]
ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా చిన్నచూపేనా అన్న ప్రశ్న ఆ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి రాజేస్తోంది. పన్నులు వసూలు చేసుకునే కర్మాగారం [more]
ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా చిన్నచూపేనా అన్న ప్రశ్న ఆ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి రాజేస్తోంది. పన్నులు వసూలు చేసుకునే కర్మాగారం లా ఈ ప్రాంత వాసులను ఉపయోగించుకోవడం తప్ప గత సర్కార్ లో కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ గోదావరి జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేకుండా పోతుందని వాపోతున్నారు. ఏనాడో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట పుణ్యాన ప్రభుత్వాలు శీతకన్ను వేసినా గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా భాసిల్లుతూ వస్తున్నాయి. అంతకు మించి ప్రభుత్వాలు పరిశ్రమల పరంగా కానీ, పర్యాటక పరంగా అనేక అవకాశాలు ఉన్నా పట్టించుకున్న పాపానికి పోలేదన్నది జనం రాజధాని మార్పు అంశంపై సాగుతున్న చర్చల్లో ఆవేదన చెందుతున్నారు.
పోలవరం పూర్తి అయినా …
పోలవరం నిర్మాణం పూర్తి అయినా ఉభయగోదావరి జిల్లాలకు పెద్దగా ఒరిగేదేమి లేదంటున్నారు. ఉత్తరాంధ్ర, కృష్ణా, రాయలసీమ లకు గోదావరి జలాలలను తరలించుకుపోవడం తప్ప గోదావరి తీరానికి వచ్చే లాభం ఏమిటన్నది ఇక్కడి వారి ప్రశ్న. పదిలక్షల ఎకరాల్లో స్థిరీకరించబడిన ఆయకట్టు ఇప్పటికే ఉందని దీని విస్తీర్ణం మరింత పెంచే మార్గాలను మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఇరిగేషన్ పథకాలు చేపట్టడం లేదనే వాదన మొదలైంది. విద్యాపరంగా గోదావరి జిల్లాలను అభివృద్ధి పరచకపోవడం వల్ల హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకొనుక్కోవలిసి వస్తుందంటున్నారు. బ్రిటిషర్ల కాలంలోనే గోదావరి జిల్లాలు బాగా అభివృద్ధి సాధించాయని కానీస్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో ఏ రకంగానూ గోదావరి జిల్లాల అభివృద్ధి సాగలేదన్నది తీరవాసుల ఘోష గా వినిపిస్తుంది.
డ్రామా పోయింది …
విభజన చట్టం లో ఇచ్చిన హామీ మేరకు సాంస్కృతిక రాజధాని రాజమండ్రి కి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రామా ఏర్పాటు చేయాలి. అయితే నాటి టిడిపి ప్రభుత్వం లోని నేతలు దీనికి స్థలం చూపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో అది కాస్తా మరో రాష్ట్రానికి పోయింది. దీనిపై ఇప్పటివరకు ఏ పార్టీ నేత నోరు మెదిపే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. గతంలో రాజమండ్రి లో రైల్వే లోకో ప్రాజెక్ట్వ వస్తే గతంలో రైల్వే శాఖా సహాయమంత్రిగా వున్న బండారు దత్తాత్రేయ గండి కొట్టి హైదరాబాద్ తరలించుకు పోయారని ఈ ప్రాంతవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేలమందికి ఉపాధి దొరికే అనేక కేంద్ర ప్రాజెక్ట్ లు సైతం ఇతర జిల్లాలకు వలస పోయాయని వైఎస్ హయాంలో ఏర్పాటు చేసిన నన్నయ్య యూనివర్సిటీ, విభజన చట్టంలో తాడేపల్లిగూడెం కి కేటాయించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)తప్ప మరేమి ఉన్నాయన్నది గోదావరి జిల్లావాసుల ఆందోళన. ఇప్పటికైనా వైసిపి సర్కార్ వ్యవసాయపరంగా ముందు వరసలో వున్న గోదావరి జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధివైపు దృష్టి పెట్టి కాకినాడ – రాజమండ్రి లను ట్విన్ సిటీస్ గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.