కొత్త జిల్లాలు 40 అవుతాయా? అదే బెటరా?

కొత్త జిల్లాల ఏర్పాటు అంటే అది అభివృధ్ధికి ప్రాతిపదికగా ఉండాలి. పైగా పాలన సులువుగా జనాలకు చేరాలి. వికేంద్రీకరణ కోసమే ఈ విభజన అన్నట్లుగా ఉండాలి. నిజానికి [more]

Update: 2020-07-25 14:30 GMT

కొత్త జిల్లాల ఏర్పాటు అంటే అది అభివృధ్ధికి ప్రాతిపదికగా ఉండాలి. పైగా పాలన సులువుగా జనాలకు చేరాలి. వికేంద్రీకరణ కోసమే ఈ విభజన అన్నట్లుగా ఉండాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఎపుడో ఏర్పాటు చేయాలి. భౌగోళికంగా చూస్తే పొరుగున ఉన్న తమిళనాడు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ పెద్దది. 130,058 చదరపు కిలోమీటర్లు ఉండగా, ఏపీ వైశాల్యం 160,205 కిలోమీటర్లుగా ఉంది. తమిళనాడులో 38 జిల్లాలు ఉంటే ఏపీలో ఇప్పటికీ 13 జిల్లాలు ఉండడం అంటేనే జిల్లాల స్వరూపం ఎంత అస్తవ్యస్థంగా ఉందోనని మేధావులు అంటున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకోవడం మంచి పరిణామమ‌ని చెబుతున్నారు.

అది నాలుగు జిల్లాలా …?

ఇక భౌగోళికంగా అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిని నాలుగు జిల్లాలుగా చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. తూర్పుగోదావరిలో పాలన సవ్యంగా సాగాలంటే ఇదే మంచి విధానం అని కూడా చెబుతున్నారు. ఇప్పటికీ జిల్లా అధికారులు కనీసం ఒక్కసారి అయినా జిల్లా మొత్తం చుట్టిన సందర్భాలు లేవంటే అది వారి తప్పు కాదని, అతి పెద్ద జిల్లాగా తూర్పుగోదావరి ఉండడమే కారణమని అంటున్నారు.

రెండు కాదుట….

ఇక ఏపీలో గిరిజన జిల్లాలు రెండుగా చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. అయితే ఇవి రెండు కంటే అయిదు దాకా ఉంటే ఆదివాసులకు ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, బుట్టాయిగూడెం, చింతూరులను కొత్తగా గిరిజన జిల్లాలుగా విభజిస్తే ఆదివాసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. అరకు నుంచి రంపచోడవరానికి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంది. పాలకొండ నుంచి కూడా అరకుకు 160 కిలోమీటర్ల దూరం ఉంది. పార్లమెంట్ సీటు ప్రాతిపదికగా విడగొట్టాలనుకుంటే ఇంతకంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

హేతుబధ్ధమేనా..?

వైసీపీ సర్కార్ పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రమాణంగా తీసుకుని కొత్త జిల్లాలు అంటోంది. అయితే ఇది సహేతుకమైన విభజన కాదని అంటున్నారు. 2026 నాటికి అప్పటి దేశ జనాభాకు అనుగుణంగా కొత్తగా పార్లమెంట్ సీట్లను పునర్విభజిస్తారు. అపుడు పాతిక ఎంపీ సీట్లు కాస్తా మరో పది వరకూ పెరిగే అవకాశం ఉంది. మరి ఆనాటికి పాతిక జిల్లాలే పరిమితం అయితే మళ్ళీ కొత్త జిల్లాలను మరిన్ని ఏర్పాటు చేయాల్సిఉంటుంది. అందువల్ల పార్లమెంట్ సీటు అన్నది అసలు ప్రాతిపదిక కాకూడదు అంటున్నారు. అదే సమయంలో ఎక్కడ వెనకబాటుతనం ఉందో, ఎక్కడ పాలనకు దూరాభారం ఉందో దాన్నే ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను విభజిస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుంది అంటున్నారు.

Tags:    

Similar News