Ys jagan : విజయమ్మను కొనసాగిస్తారా? తొలగిస్తారా?

పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలో ఎన్నికలు నిర్వహించి తిరిగి పార్టీ కార్యవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ గత [more]

Update: 2021-10-27 02:00 GMT

పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలో ఎన్నికలు నిర్వహించి తిరిగి పార్టీ కార్యవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ గత కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించడం లేదు. దీనిపై కొందరు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించే అవకాశముంది. న్యాయస్థానం గడప కూడా తొక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్లీనరీ నిర్వహించింది. అయితే మూడేళ్లు గడుస్తున్నా ప్లీనరీ ఊసేలేదు.

రెండేళ్లకొకసారి….

రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీ అయినా ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీ ప్లీనరీని నిర్వహించాలి. సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తి చేయాలి. వైసీపీ 2017లో ప్లీనరీని నిర్వహించింది. ప్రస్తుతం పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ, అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతున్నారు. 2019లోనే పార్టీలో తిరిగి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకూ ఆ దిశగా వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.

కొత్త కార్యవర్గం ఏర్పాటుపై….

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం పార్టీకి కూడా అవసరమే. నామినేటెడ్ పోస్టులు, పదవులు దక్కని వారిని పార్టీ పదవుల్లో నియమించే అవకాశముంది. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రి పదవి దక్కని సీనియర్లకు పార్టీ పదవులు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ఈసారి గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మను కొనసాగిస్తారా? లేదా? అన్నది కూడా సందేహమే.

సంస్థాగత ఎన్నికలపై….

మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఆయన సంస్థాగత ఎన్నికలను నిర్వహించకపోవడంపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసే అవకాశముంది. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుంది. దీంతో జగన్ కూడా పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బహుశ వచ్చే ఏడాది జూన్ నెలలో జరిగే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News