గాడిలో పెడదామంటే…గండి కొట్టారే

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇరకాటంలో పడ్డారు. ఇటు మంత్రుల్లో, సీనియర్లలో అసంతృప్తి ఒకవైపు, అధిష్టానం హెచ్చరికలు మరోవైపు యడ్యూరప్పను ఇబ్బందుల్లోకి నెట్టేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక విషయంలో బీజేపీ [more]

Update: 2019-08-30 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇరకాటంలో పడ్డారు. ఇటు మంత్రుల్లో, సీనియర్లలో అసంతృప్తి ఒకవైపు, అధిష్టానం హెచ్చరికలు మరోవైపు యడ్యూరప్పను ఇబ్బందుల్లోకి నెట్టేలా కన్పిస్తున్నాయి. కర్ణాటక విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఫర్మ్ గా ఉంది. అసమ్మతి నేతలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని భావిస్తోంది. అసమ్మతికి తలొగ్గితే భవిష్యత్తులో మరిన్ని చికాకులు తప్పవని యడ్యూరప్పకు స్పష్టమైన సంకేతాలు పంపింది.

తక్కువ సంఖ్యలో….

కర్ణాటకలో సుదీర్ఘకాలం తర్వాత భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడింది. అదీ కాంగ్రెస్, జేడీఎస్ లలో ఉన్న అసంతృప్తి కారణంగానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారన్నది అందరికీ తెలిసిన సంగతే. అయితే బీజేపీ ప్రభుత్వం కాపాడుకోవాలంటే సీనియర్ నేతలను సంతృప్తి పర్చాల్సిన బాధ్యత యడ్యూరప్ప మీద ఉంది. తొలి మంత్రి వర్గ విస్తరణలో కేవలం 17 మందికి మాత్రమే చోటు కల్పించారు. మలి విడత మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనేది స్పష్టత లేదు.

మలి విడత విస్తరణలో….

ఇప్పటికే మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలు అసంతృప్తితో రగలి పోతున్నారు. వారిని బుజ్జగించడానికి యడ్యూరప్ప మలి విడత మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. కొంతకాలం ఓపిక పట్టమని వారిని సూచిస్తున్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కొంత కాలం అసమ్మతి నేతలు మౌనంగా ఉంటారన్నది యడ్యూరప్ప ఆలోచన. కానీ అధిష్టానం మాత్రం ససేమిరా అంటోంది.

ఇప్పట్లో ఉండదని…..

ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదని అధిష్టానం తేల్చిచెప్పింది. ఇలా అందరికీ హామీలు ఇవ్వవద్దని కూడా యడ్యూరప్పకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడనేది తామే నిర్ణయిస్తామని, అందరికీ అవకాశాలు దక్కవని కూడా ఆయన కొంత కటువుగానే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్త నేతలను గాడికి తీసుకురావచ్చన్న యడ్యూరప్ప ఆలోచనలకు అధిష్టానం గండికొట్టింది.

Tags:    

Similar News