ఆ ఆరుగురు ఎవరో…?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు అనుమతి [more]

Update: 2020-11-13 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు అనుమతి తెచ్చుకునే అవకాశాలున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే ఆ ఆరుగురు ఎవరన్న చర్చ ప్రారంభమయింది. యడ్యూరప్ప కు చెక్ పెట్టేందుకు ఆయన ప్రత్యర్థులు సిద్ధమయి పోయారు. ఇప్పటికే కొందరు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

ఏదో ఒక ఆటంకం…..

యడ్యూరప్ప ముఖ్యమంత్రి గా బాధ్యతలను చేపట్టినా ఆయన ఇష్టప్రకారం సాగడం లేదు. ప్రతి దానికి హైకమాండ్ నుంచి ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి. వాస్తవంగా యడ్యూరప్ప తన మంత్రివర్గ విస్తరణను ఎప్పుడో చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేశారు. కానీ అప్పట్లో కేంద్ర నాయకత్వం యడ్యూరప్ప కు పదిమందికి మాత్రమే అవకాశం కల్పించింది. దీంతో మరో దఫా మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

వారికే అవకాశం ఇవ్వాలని….

ఈ దశ విస్తరణలో మరో ఆరుగురికి యడ్యూరప్ప అవకాశం కల్పించనున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచి రాజీనామాలు చేసిన వారికి తన కేబినెట్ లో చోటు కల్పించాలన్నది యడ్యూరప్ప ఉద్దేశ్యం. దీనిపై యడ్యూరప్ప పట్టుదలతో ఉన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండటానికి కారణమయిన వారిని తాను విస్మరించలేనని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ శంకర్, ఎంటీబీ నాగారాజ్, హెచ్. విశ్వనాధ్ వంటి వారికి మంత్రి పదవి ఇవ్వకుంటే తాను ముఖ్యమంత్రిగా వేస్ట్ అన్న నిర్ణయానికి యడ్యూరప్ప వచ్చారు.

వ్యతిరేక వర్గం…..

ఈ నేపథ్యంలో యడ్యూరప్ప వ్యతిరేక వర్గం వేగంగా పావులు కదుపుతుంది. తొలినుంచి బీజేపీ కి పనిచేసిన వారికే మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వాలని వారి డిమాండ్ గా ఉంది. అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్ప ను తప్పించాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణలో ఆ ఆరుగురు ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News