యడ్డీకి అడ్డులేకుండా?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించి పది రోజులు దాటుతుంది. పార్టీ మొత్తం తన గుప్పిట్లో ఉన్నట్లేనని భావిస్తున్న యడ్యూరప్ప నిజం చేశారనిపిస్తోంది. మంత్రి [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించి పది రోజులు దాటుతుంది. పార్టీ మొత్తం తన గుప్పిట్లో ఉన్నట్లేనని భావిస్తున్న యడ్యూరప్ప నిజం చేశారనిపిస్తోంది. మంత్రి [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించి పది రోజులు దాటుతుంది. పార్టీ మొత్తం తన గుప్పిట్లో ఉన్నట్లేనని భావిస్తున్న యడ్యూరప్ప నిజం చేశారనిపిస్తోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన రోజు కొద్దో గొప్పో అసంతృప్తి విన్పించిన గళాలు తర్వాత మూగబోయాయి. ఈ విస్తరణలో కేవలం పది మందిని మాత్రమే తీసుకోవడం, మరోసారి విస్తరణ ఉండటంతో నేతలు కూడా మిన్నకుండిపోయారు. ఇది అధిష్టానం, యడ్యూరప్ప వ్యూహంలో భాగమేనంటున్నారు.
మంత్రి వర్గ విస్తరణ జరిపినా…
సుదీర్ఘకాలం తర్వాత యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ చేశారు. అదీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు దక్కేలా చూసుకున్నారు. తన మాటను నెగ్గించుకోగలిగారు. అయితే మంత్రి వర్గ విస్తరణ తేనెతుట్టెను కదలించినట్లవుతుందని, యడ్యూరప్ప ప్రభుత్వానికి ప్రమాదమేనని విపక్షాలు అంచనాలు వేశాయి. మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కలసి కట్టుగా ఉన్నామని…..
కానీ వారు అనుకున్నట్లుగా పార్టీలో అసమ్మతి పెద్దయెత్తున చెలరేగలేదు. అయినా కలసికట్టుగా ఉన్నామన్న సంకేతాలను విధాన పరిషత్ ఎన్నిక ద్వారా బీజేపీ బలంగా పంపినట్లయింది. ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది విధాన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు 120 మంది ఓట్లు వేశారు. 113 ఓట్లు లక్ష్మణ్ సవదికే వచ్చాయి. మరో ఏడు ఓట్లు చెల్లకుండా పోయాయి. కేవలం ఒక సభ్యుడు మాత్రమే అనారోగ్యం కారణంగా ఓటింగ్ కు రాలేకపోయారు.
అసంతృప్తి ఉన్నా…..
దీన్ని బట్టి బీజేపీ ఎమ్మెల్యేలు సంఘటితంగా ఉన్నారని చెప్పకనే తెలుస్తోంది. ఇక విధాన పరిషత్ ఎన్నికకు కాంగ్రెస్, జేడీఎస్ లు దూరంగా ఉన్నాయి. మంత్రి పదవులు దక్కని పార్టీ సీనియర్ నేతల్లో ఒకింత అసహనం కనపడుతున్నా వారు బయటపడలేని పరిస్థితిని యడ్యూరప్ప కల్పించారంటున్నారు. మొత్తం మీద యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ జరిపిన తర్వాత పార్టీలో కట్టుబాటు చెక్కు చెదరనివ్వలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి విపక్షాల అంచనాలను యడ్యూరప్ప తలకిందులు చేసినట్లయింది.