అప్ప పుత్రప్రేమ పీక్స్ కు చేరినట్లేనా?

కర్ణాటకలో మరోసారి ఉప ఎన్నికల నగారా మోగనుంది. బసవకల్యాణ, మస్కి అసెంబ్లీ స్థానాలతో పాటు బెళగావి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ [more]

Update: 2021-02-03 17:30 GMT

కర్ణాటకలో మరోసారి ఉప ఎన్నికల నగారా మోగనుంది. బసవకల్యాణ, మస్కి అసెంబ్లీ స్థానాలతో పాటు బెళగావి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బసవకళ్యాణ నుంచి పోటీ చేయించేందుకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన కుమారుడిని రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. కుమారుడు విజయేంద్రను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని యడ్యూరప్ప ఇప్పటికే అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది.

బరిలోకి దించాలని….

యడ్యూరప్ప తన కుమారుడు విజయేంద్ర ను బసవకల్యాణలో పోటీ చేయించి గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికను యడ్యూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే యడ్యూరప్ప ఈ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే పనిలో పడ్డారు. విజయేంద్ర సయితం ఇప్పటికే అనేక సార్లు బసవకల్యాణ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ బీజేపీ క్యాడర్ తో మమేకం అవుతున్నారు.

వారు ఎక్కువగా ఉండటంతో…

బసవకల్యాణ నియోజకవర్గంలో వీరశైవ లింగాయత సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. వీరి మద్దతు పొందాలన్నా, పార్టీ ఇక్కడ గెలుపు సాధించాలన్నా తన కుమారుడు విజయేంద్ర అయితేనే బెటర్ అని యడ్యూరప్ప హైకమాండ్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న మఠాధిపతులు, వీరశైవ లింగాయత్ నేతలతో తరచూ సమావేశాలను విజయేంద్ర నిర్వహిస్తుండటం విశేషం.

కాంగ్రెస్ కూడా….

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ కుమారుడు విజయ్ సింగ్ ను ఇక్కడి నంుచి బరిలోకి దించాలని భావిస్తుంది. అదే జరిగితే గట్ట ిపోటీ ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు యడ్యూరప్పపై ఇప్పటికే పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు హైకమాండ్ అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News