యడ్డీకి వరంగా మారిన మోదీ, షా నిర్ణయం
భారతీయ జనతా పార్టీకి మోదీ, షాల హయాంలో ఒక సిద్ధాంతం లేదు. ఒక విధానం లేదన్నది మరోసారి స్పష్టమయింది. అందరికీ ఒక రూల్… తమకు అవసరం ఉంటే [more]
భారతీయ జనతా పార్టీకి మోదీ, షాల హయాంలో ఒక సిద్ధాంతం లేదు. ఒక విధానం లేదన్నది మరోసారి స్పష్టమయింది. అందరికీ ఒక రూల్… తమకు అవసరం ఉంటే [more]
భారతీయ జనతా పార్టీకి మోదీ, షాల హయాంలో ఒక సిద్ధాంతం లేదు. ఒక విధానం లేదన్నది మరోసారి స్పష్టమయింది. అందరికీ ఒక రూల్… తమకు అవసరం ఉంటే మరొక రూల్ అనేలా నిర్ణయాలు ఉంటున్నాయి. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. శ్రీధరన్ ఎంపిక తప్పు అంటూ కొందరు బహిరంంగా వ్యాఖ్యానిస్తున్నారు.
శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా…..
మెట్రో మ్యాన్ శ్రీధరన్ కు ఎనభై ఏళ్లు. ఆయన మొన్ననే పార్టీలో చేరారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యారు. అయితే వయసును బూచిగా చూపి ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషిలను పక్కన పెట్టిన గడ్డం గ్యాంగ్ ఇప్పుడు మెట్రోమ్యాన్ ను ఎలా అభ్యర్థిగా ప్రకటిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ విషయంపై పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూటిగా ప్రశ్నించడం విశేషం.
కేరళలో గెలవలేం కాబట్టే….
అయితే కేరళలో బీజేపీ ఎటూ గెలిచే అవకాశం లేదు. అందుకే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని అంతర్గతంగా నేతలకు అధినాయకత్వం సర్ది చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్ లో ఇదే పార్టీకి ఇబ్బందిగా మారబోతుందంటున్నారు. కేరళలో గెలవకపోవచ్చు. శ్రీధరన్ ఆ వయసులో ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర నేతలు ఊరుకుంటారా? బలంగా ఉన్న యడ్యూరప్ప అస్సలు ఒప్పుకుంటారా? అంటే లేదననే సమాధానమే విన్పిస్తుంది.
యడ్డీకి మాత్రం….
వచ్చే ఎన్నికల నాటికి యడ్యూరప్పను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని అధినాయకత్వం నిర్ణయించింది. వయసు రీత్యా ఇక మానుకోవాలని కూడా సూచించింది. అదే యడ్యూరప్ప కు ఇప్పుడు కేరళ ఘటన కలసి వచ్చింది. కర్ణాటకలో బలమైన నేతగా ఉన్న యడ్యూరప్ప మరికొంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు. కానీ అధినాయకత్వం వత్తిడితో ఆయన వచ్చే ఎన్నికల నాటికి తప్పుకోవాలనుకున్నా, కేరళలో బీజేపీ తీసుకున్న నిర్ణయం యడ్డీకి వరంగా మారింది. మరి అధినాయకత్వం కేరళ విషయంలో తప్పు చేసిందా? భవిష‌్యత్ లో దీనిని అడ్డం పెట్టుకుని అనేక గొంతులు లేవనున్నాయా? అన్నది చూడాల్సి ఉంది.