సెగ మామూలుగా లేదుగా?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సొంత పార్టీ నుంచి సెగ బాగానే తగులుతుంది. ఎందుకో ఈసారి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం బాగా లేనట్లుంది. పదవి చేపట్టిన [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సొంత పార్టీ నుంచి సెగ బాగానే తగులుతుంది. ఎందుకో ఈసారి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం బాగా లేనట్లుంది. పదవి చేపట్టిన [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సొంత పార్టీ నుంచి సెగ బాగానే తగులుతుంది. ఎందుకో ఈసారి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం బాగా లేనట్లుంది. పదవి చేపట్టిన నాటినుంచే అసమ్మతి గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండటం ఆశ్చర్యకరమే. అయితే కేంద్ర నాయకత్వం అండ లేకుండా అసమ్మతి నేతలు ఇంత బాహాటంగా వ్యవహరించరని యడ్యూరప్ప అనుమానంలో నిజం లేకపోలేదు.
బలమైన నేత కావడంతో…..
యడ్యూరప్ప కర్ణాటక బీజేపీలో బలమైన నేత. ఒకరకంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చోటు దక్కించుకుందంటే అది యడ్యూరప్ప పుణ్యమే. దానిని ఎవరూ కాదనలేరు. ఒకసారి బీజేపీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్నా తిరిగి పార్టీలోకి తీసుకున్నారంటే ఆయన నాయకత్వం ఏపాటిదో చెప్పకనే చెబుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో అధికారం కోల్పోయిన బీజేపీ 14 నెలల పాటు పవర్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.
వ్యూహాల కారణంగానే…?
యడ్యూరప్ప వ్యూహాల కారణంగానే కర్ణాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు యడ్యూరప్ప ఇస్తున్న ప్రయారటీ ఆయనకు పార్టీ లో ఇబ్బందికరంగా మారింది. తాను అధికారంలోకి రావడానికి కారణమైన వారిని ఎలా విస్మరిస్తామన్న యడ్యూరప్ప వాదనలోనూ నిజముంది. కానీ దానిని అంగీకరించేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు.
వరస అసంతృప్తులతో….
అందుకే మొన్న బసవగౌడ యత్నాల్, నేడు మంత్రి ఈశ్వరప్ప యడ్యూరప్పకు ఇబ్బందిగా మారారు. ఈశ్వరప్ప చిన్న సమస్యను పెద్దదిగా చేశారంటున్నారు. తనకు తెలియకుండా తన శాఖ పరిధిలోని నిధులను ముఖ్యమంత్రి కేటాయించడాన్ని ఈశ్వరప్ప తప్పుపడుతున్నారు. ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదుచేశారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారంతో అసమ్మతి మరింత పెరిగింది. మరి దీని నుంచి యడ్యూరప్ప ఎలా బయటపడతారో చూడాలి.