తిరుగుబాటు తప్పదట.. సిద్ధంగా ఉండాల్సిందేనా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవీ గండం పొంచి ఉన్నట్లే కన్పిస్తుంది. మే 2 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోతారన్న ప్రచారం [more]

Update: 2021-04-21 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవీ గండం పొంచి ఉన్నట్లే కన్పిస్తుంది. మే 2 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోతారన్న ప్రచారం పెద్దయెత్తున సాగుతోంది. దీంతో యడ్యూరప్పలో కంగారు మొదలయింది. స్వామీజీలు, మఠాలు చుట్టూ యడ్యూరప్ప ప్రదిక్షిణలు చేయడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు పదవీగండం పొంచి ఉందన్న అనుమానంతోనే యడ్యూరప్ప మఠాలు చుట్టూ తిరుగుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

బలమైన నేత కావడంతో…

యడ్యూరప్ప మీద సొంత పార్టీలోనే అసంతృప్తి ఉందన్నది వాస్తవం. అయితే అది ఎంతవరకూ ఉంది? పదవిలో నుంచి యడ్యూరప్ప ను దించేంత బలంగా ఉందా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్పను బలవంతంగా కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రి పదవి నుంచి దించే అవకాశాలు లేవు. ఆయనకు మరో ఉన్నత పదవిని అప్పగించిన తర్వాతనే అది సాధ్యమవుతుంది. అటూ ఇటూ అయితే యడ్యూరప్ప పార్టీ నాయకత్వాన్ని థిక్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి.

స్మూత్ గా డీల్ చేయాలని…

ఈ నేపథ్యంలో యడ్యూరప్ప వ్యవహారాన్ని కేంద్ర నాయకత్వం స్మూత్ గా డీల్ చేస్తుందంటున్నారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రి గా కొనసాగించడం అధినాయకత్వానికి సుతారమూ ఇష్టం లేదన్నది వాస్తవం. ఆయన వస్తున్న ఆరోపణలు, వయసు రీత్యా ఆయనను పదవి నుంచి తప్పించి కొత్త నేతను వచ్చే ఎన్నికలకు సిద్దం చేయాలన్న యోచనలో కేంద్ర నాయకత్వం ఉంది. ఇందుకోసం పలువురు పేర్లను కూడా పరిశీలించింది.

యాభై మంది ఎమ్మెల్యేలు….

ఈ నేపథ్యంలో మే 2తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదని అంటున్నారు. యడ్యూరప్ప వ్యతిరేక వర్గం లెక్కల ప్రకారం దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఒకచోటకు చేరే అవకాశం లేదు. అదే సమయంలో అధిష్టానం యడ్యూరప్పను తప్పించినా కొత్త నాయకత్వంవైపు మొగ్గు చూపుతారు. యడ్యూరప్ప కూడా తన వర్గాన్ని బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అన్నదానిపై ఊహాగానాలు మాత్రం కన్నడ నాట ఆగడం లేదు.

Tags:    

Similar News