లాక్ డౌన్ తో మరింత డౌన్ అయినట్లేనా?

కర్ణాటకలో స్థానిక సంస్థలను కరోనా కారణంగా వాయిదా వేశారు. కర్ణాటకలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప 14 రోజుల పాటు లాక్ [more]

Update: 2021-05-09 18:29 GMT

కర్ణాటకలో స్థానిక సంస్థలను కరోనా కారణంగా వాయిదా వేశారు. కర్ణాటకలో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్స్ కూడా అందుబాటులో లేకపోవడం, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో యడ్యూరప్ప లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న తొలి బీజేపీ ప్రభుత్వంగా యడ్యూరప్ప సంచలనం సృష్టించారు.

మోదీ నిర్ణయంతో…..

లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు వదిలేశారు. పరిస్థితులను బట్టి ఆఖరి ప్రయత్నంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టేశాయి. అయితే అక్కడ ఉన్నది బీజేపీ యేతర ప్రభుత్వాలే. కానీ కర్ణాటకలో యడ్యూరప్ప తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేరళ వంటి రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ పెట్టబోమని చెబుతుంటే యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

తొలి నుంచి…..

యడ్యూరప్ప పై కేంద్ర నాయకత్వం తొలి నుంచి కొంత అసంతృప్తిగా ఉంది. ఆయనకు కనీసం మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా లభించడం లేదు. మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ నాన్చి నాన్చి చివరకు ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని యడ్యూరప్పకు సంకేతాలు కూడా అందాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్పకు, పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది.

కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు….

దీంతో యడ్యూరప్ప మోదీ సూచనలను కూడా పట్టించుకోకుండా లాక్ డౌన్ పెట్టారని సొంత పార్టీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సహకారం లభించడం లేదని, ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని యడ్యూరప్ప సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దీనిపై తాను కేంద్ర నాయకత్వానికి సర్దిచెప్పుకోగలనన్న ధీమాలో యడ్యూరప్ప ఉన్నారు. మొత్తం మీద యడ్యూరప్ప లాక్ డౌన్ నిర్ణయం పార్టీలో వివాదంగా మారిందంటున్నారు.

Tags:    

Similar News