అంత పెరిగిపోయిందా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప లో ధీమా పెరిగింది. తనకు ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన ధైర్యంగా ఉంటున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో సయితం [more]

Update: 2019-11-02 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప లో ధీమా పెరిగింది. తనకు ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన ధైర్యంగా ఉంటున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో సయితం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్న విశ్వాసంతో యడ్యూరప్ప ఉన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మరో ఎనిమిది సభ్యుల అవసరం ఉంటుంది. అయితే ఉప ఎన్నికల్లో గెలవకపోయినా ఆల్టర్నేటివ్ ప్లాన్ వేసి పెట్టుకున్నారంట యడ్యూరప్ప.

ఉప ఎన్నికల్లో….

పదిహేను స్థానాల్లో నాలుగు నుంచి ఐదు శాసనసభ సీట్లు రావన్నది పార్టీ ఇటీవల అంతర్గతంగా జరిపిన సర్వేలో వెల్లడయింది. డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నివేదిక యడ్యూరప్ప తొలినాళ్లలో భయపెట్టింది. అయితే సర్వే నిర్వహించిన తర్వాత కర్ణాటక మొత్తం వరదలు సంభవించాయి. ఈ వరదల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత సాయం అందకపోవడం, సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమవ్వడంతో యడ్యూరప్పకు ఆ సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల అంచనా.

అనుకూలంగా మార్చుకోవడానికి….

కానీ తాజాగా మారుతున్న పరిస్థితులు యడ్యూరప్పకు అనుకూలంగా మారుతున్నాయంటున్నారు. జనతాదళ్ ఎస్ నుంచి ఏకంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు యడ్యూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. గంపగుత్తగా వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని షరతు కూడా విధించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.

చేరికలకు అనుమతి…..

ఇక యడ్యూరప్ప కు అధిష్టానం కూడా చేరికలకు అనుమతి ఇచ్చింది. ఉప ఎన్నికల ఫలితాల్లో తేడా కొట్టినా ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. అందుకే యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించినా తాను మాట తప్పలేదని చెప్పుకోవచ్చనుకుంటున్నారు. అందుకే తాను మాట మీద నిలబడతానని చెబుతున్నారు. యడ్యూరప్పలో అంత ధీమా పెరగడానికి కారణం జేడీఎస్ అనే అంటున్నారు. పైకి మాత్రం తాము ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు.

Tags:    

Similar News