మానసికంగా సిద్ధమయ్యారు కానీ?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను పదవి నుంచి తప్పుకోవడానికి మానసికండా సిద్దమయినట్లే కన్పిస్తుంది. కేంద్ర నాయకత్వం అధికార మార్పు పట్ల ధృఢంగా ఉండటంతో తాను చేయగలిగిందేమీ లేదని [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను పదవి నుంచి తప్పుకోవడానికి మానసికండా సిద్దమయినట్లే కన్పిస్తుంది. కేంద్ర నాయకత్వం అధికార మార్పు పట్ల ధృఢంగా ఉండటంతో తాను చేయగలిగిందేమీ లేదని [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాను పదవి నుంచి తప్పుకోవడానికి మానసికండా సిద్దమయినట్లే కన్పిస్తుంది. కేంద్ర నాయకత్వం అధికార మార్పు పట్ల ధృఢంగా ఉండటంతో తాను చేయగలిగిందేమీ లేదని కూడా యడ్యూరప్ప భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తనకు అండగా ఉండేవారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో యడ్యూరప్ప ఉన్నారు. తనకు మద్దతు ఎక్కువ ఉందని తెలిస్తే అధిష్టానం కొంత తన మాటకు విలువ ఇస్తుందన్న యోచనలో ఉన్నారు.
తాను తప్పుకుని…
ముఖ్యమంత్రి పదవి నుంచి తాను తప్పుకోవడం ఖాయమని యడ్యూరప్పకు అవగతమయింది. అందుకే అధిష్టానం ఇప్పటి వరకూ తనకు మంత్రి వర్గ విస్తరణకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఫిబ్రవరి నెల తర్వాత అధికార మార్పిడి ఉండవచ్చన్నది కర్ణాటక బీజేపీలో జోరుగా చర్చ జరుగుతుంది. జనవరి నెలలో కర్ణాటక రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి అరుణ్ సింగ్ సయితం రానున్నారు.
తనకు అనుకూలమైన వ్యక్తినే….
ఈ నేపథ్యంలోనే యడ్యూరప్పను మార్చే నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇప్పటివరకూ నేరుగా యడ్యూరప్పకు ఈ విషయం చెప్పకపోయినప్పటికీ ఆ రకమైన సంకేతాలను మాత్రం పంపారు. అయితే తాను దిగిపోవడం ఖాయమని తెలిసిన యడ్యూరప్ప తనకు అనుకూలమైన నేత ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులను ఆయన ప్రారంభించారు.
తన వర్గంతో సమావేశాలు…..
తన వర్గం వారితో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అమిత్ షా తో ఎవరెవరు ఏయే అంశాలపై చర్చించాలన్నది యడ్యూరప్ప వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు మంత్రివర్గంలో ఎవరు ఉండాలన్న దానిపైన కూడా ముందుగానే చర్చించుకోనున్నారు. తమ అభిప్రాయాలను నేరుగా అమిత్ షాతో చెప్పాలని యడ్యూరప్ప వర్గం భావిస్తుంది. అప్పటికీ అధిష్టానం మొండికేస్తే అప్పటి పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని యడ్యూరప్ప భావిస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి యడ్యూురప్ప సిద్ధమయ్యారు. అయితే తన మనిషినే ఆ పీఠం పై కూర్చెపెట్టాలని మాత్రం గట్టిగా భావిస్తున్నారు. మరి యడ్యూరప్ప ఈ విషయంలో ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.