బాబు… ఆ పదవిని వారికి మాత్రం ఇవ్వరట

తెలుగుదేశం పార్టీకి యువత దూరమవుతోంది. చంద్రబాబు నిలకడలేని తనం, లోకేష్ పై నమ్మకం లేకపోవడంతో యువత ఎక్కువగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి [more]

Update: 2020-08-16 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి యువత దూరమవుతోంది. చంద్రబాబు నిలకడలేని తనం, లోకేష్ పై నమ్మకం లేకపోవడంతో యువత ఎక్కువగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు యువత బలంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగుయువత ముఖ్యపాత్ర పోషించేది. కానీ ప్రస్తుతం తెలుగు యువత అంటే సీనియర్ల వారసులుగానే చూస్తుండటంతో పార్టీ వైపు యువత పెద్దగా మొగ్గు చూపడం లేదు.

అనేక మంది నేతలు….

తెలుగుయువత కు సారథ్యం వహించిన అనేక మంది నేతలు తర్వాత కాలంలో ఉన్నత పదవులు పొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అనేక మంది తెలుగు యువత పగ్గాలు చేపట్టడానికి ముందుకు వచ్చేవారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, అమర్నాధ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, బీద రవిచంద్ర యాదవ్ లాంటి నేతలు తెలుగు యువతకు నాడు సారథ్యం వహించారు. కానీ ఇప్పుడు ఆ పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఆరు నెలలు దాటుతున్నా……

తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి రాజీనామా చేసి వెళ్లి ఆరు నెలలు దాటుతోంది. ఇప్పటివరకూ ఆపదవిలో ఎవరినీ తెలుగుదేశం అధినేత నియమించలేదు. కమ్మ సామాజిక వర్గం కాకుండా ఇతర కులాలకు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇందులో అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి. గంటి హరీశ్ మాధుర్, పరిటాల శ్రీరామ్, చింతకాయల విజయ్ వంటి వారిని సంప్రదించారు కూడా.

ఎవరూ ముందుకు రావడం లేదే….

అయితే వీరెవ్వరూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రాలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి పేరును కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మరోవైపు నాదెళ్ల బ్రహ్మం చౌదరి కూడా తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన లోకేష్ కు సన్నిహితుడు. అయితే ఈయన పట్ల చంద్రబాబు ఆసక్తి చూపడం లేదంటున్నారు. పార్టీ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు కావాలంటే తెలుగుదేశంపార్టీలో యువత అవసరం. తెలుగు యువత కార్యవర్గాన్ని నియమించడంలోనే చంద్రబాబు ఇంత టైమ్ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. వారసులకు ఇవ్వకుండా కొత్త వారిని నియమించాలన్న సూచనలు కూడా చంద్రబాబుకు అందుతున్నాయి.

Tags:    

Similar News