అసలు అజెండా ఇదేనట
టైటిల్….. విభజన సమస్యలు, నీటి వినియోగం, ఉద్యోగుల సమస్యలు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మూడు గంటల భేటీ వెనుక అంతకు మించే జరిగిందన్నది పొలిటికల్ టాక్. [more]
టైటిల్….. విభజన సమస్యలు, నీటి వినియోగం, ఉద్యోగుల సమస్యలు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మూడు గంటల భేటీ వెనుక అంతకు మించే జరిగిందన్నది పొలిటికల్ టాక్. [more]
టైటిల్….. విభజన సమస్యలు, నీటి వినియోగం, ఉద్యోగుల సమస్యలు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మూడు గంటల భేటీ వెనుక అంతకు మించే జరిగిందన్నది పొలిటికల్ టాక్. ఇద్దరి భేటీకి ముందు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో చర్చలు జరిపి ప్రగతి భవన్ కి రావడం ఆసక్తికరంగా చూడొచ్చు. అందులోను జగన్ – కెసిఆర్ ల భేటీ షెడ్యూల్ లో ప్రకటించలేదు. ఎంతసేపు వీరిద్దరి నడుమ చర్చ అన్నది కూడా వెల్లడించలేదు. ఇక అత్యంత ముఖ్యమైన ఈ భేటీలో గతంలోలా అధికారగణం లేదు. జగన్ కి అత్యంత నమ్మకమైన సజ్జల రామకృష్ణ రెడ్డి, మిధున్ రెడ్డిలు మాత్రమే ఉండటం గమనార్హం. వైసిపి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఇరువురు ముఖ్యమంత్రులు రెండు నెలల్లో ఆరుసార్లు భేటీ అయ్యారు. అయితే ఇప్పటివరకు గోప్యంగా అధికారులు లేకుండా కలవడం ఇదే కావడం విశేషం.
టార్గెట్ బిజెపి … ?
తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు కాషాయం కన్ను పడింది. ముఖ్యంగా తెలంగాణ పై ఇప్పటికే కమలం గట్టిగా గురిపెట్టింది. ఇక ఎపి లో కూడా జోరుమీదే వుంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో వ్యవహరించాలిసిన అంశాలపై తెలుగు ముఖ్యమంత్రులు వై.ఎస్. జగన్, కేసీఆర్ భేటీలో ప్రధానంగా చర్చించారని రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. పైకి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై అని పేర్కొన్నప్పటికీ ఎక్కువసమయం భవిష్యత్తు రాజకీయ అంశాలపైనే చర్చ నడిచిందంటున్నారు. ఇప్పటినుంచి బిజెపి ని కంట్రోల్ చేయకపోతే మనుగడ కష్టమేనని కమలం వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సాగాలన్నది తెలుగు సిఎంల హిడెన్ అజెండా అని సాగుతున్న ప్రచారం లో వాస్తవం ఎంత అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.