వారికి ఎలాంటి షరతుల్లేవ్

వైఎస్ జగన్ ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? కొంత స్థాయి ఉన్న నేతలకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలని షరతు విధించారా? [more]

Update: 2019-07-31 03:30 GMT

వైఎస్ జగన్ ఇతర పార్టీల నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? కొంత స్థాయి ఉన్న నేతలకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వాలని షరతు విధించారా? ప్రజల్లో బలం, బలగం ఉన్న వారికే కండువాలు కప్పేయాలని జగన్ ఆదేశించారా? అవును అనే అంటున్నాయి వైసీపీ వర్గాలు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బకొట్టేలా ఈ చేరికలు ఉంటాయంటున్నారు.

చేరికలకు గ్రీన్ సిగ్నల్…..

అవును వైఎస్ జగన్ పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రతి ఎమ్మెల్యేకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారంటున్నారు. స్థానికసంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరాలంటే వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం ఎలాంటి షరతులు లేవు.

స్థానిక సంస్థల నేపథ్యంలో….

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను సాధించి విజయకేతనం ఎగురవేసిన వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం అదే ప్రభంజనాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేక నియోజకవర్గాల్లో పటిష్టంగా ఉంది. బలమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు కూడా కలిగి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా నుంచి వచ్చాక…..

వైఎస్ జగన్ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్య నేతలందరూ జగన్ సమక్షంలో చేరడానికి రెడీ అవుతున్నారు. కడప జిల్లాకు చెందిన వీరశివారెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరబోతున్నారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇలా జగన్ చేరికలకు ఓకే చెప్పడంతో త్వరలోనే ఫ్యాన్ పార్టీ కొత్త నాయకులతో కళకళలాడనుంది.

Tags:    

Similar News