జగన్ కు దూరమవుతున్నారా?

అదేంటి జగన్ జిగినీ దోస్త్ కేసీఆర్ కదా. పైగా ఇద్దరి మధ్య చాలా మంది సంబంధాలు ఉన్నాయి కదా. జగన్ ని 2014లోనే గెలుస్తాడంటూ జోస్యం చెప్పిన [more]

Update: 2020-06-30 15:30 GMT

అదేంటి జగన్ జిగినీ దోస్త్ కేసీఆర్ కదా. పైగా ఇద్దరి మధ్య చాలా మంది సంబంధాలు ఉన్నాయి కదా. జగన్ ని 2014లోనే గెలుస్తాడంటూ జోస్యం చెప్పిన పార్టీ కూడా టీఆర్ఎస్ కదా. ఇక జగన్ సీఎం కాగా ఎక్కువగా సంతోషించినది కూడా కేసీఆరే కదా. పైగా జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చి మొత్తం పౌరోహిత్యం చేసింది. దీవించిందీ కూడా ఆయనే కదా. ఇలా ఒక్కటి కాదు సవాలక్ష డౌట్లు పుట్టుకువస్తాయి. ఇద్దరికీ కొంపదీసి చెడిందా ఏంటి ?అన్న ఆలోచనా కూడా చటుక్కున వస్తుంది. అయితే ఎంత స్నేహితుడు అయినా జగన్ చేసినవి అన్నీ మంచి పనులు అని చెప్పలేరు కదా. జగన్ చేసే వాటిలో నచ్చనివీ చాలా ఉంటాయి. అందులో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా అన్న డౌట్ ఇపుడు ఏపీ జనాలకు వస్తోంది.

ఆర్ధిక కేంద్రంగా….

ఇక విజయవాడను ఆర్ధిక కేంద్రంగా తాజాగా మంత్రి కేటీఆర్ తాజాగా పేర్కొనడం విశేషం. హైదరాబాద్ విజయవాడల మధ్య హ స్పీడ్ రైల్ తేవాలని కేటీఆర్ అనడం విశేషం. అలా కనుక చేస్తే హై వే వెంబడి రెండు ప్రాంతాలు విపరీతంగా అభివృధ్ధి చెందుతాయని ఆయన అంటున్నారు. పైగా విజయవాడ ఆర్ధికంగా ఎంతో అభివృధ్ధి చెందిందని, మరింతగా భవిష్యత్తు ఉందని కూడా కేటీఆర్ అనడం విశేషం. అంటే విజయవాడను రాజధానిగా కేటీఆర్ అంగీకరించినట్లుగానే చెప్పాలిక్కడ.

అపుడు అలా…

ఇక కేటీఆర్ గతంలో కూడా అమరావతి ఉద్యమం బాగా ఊపు మీద ఉన్న వేళ కూడా కీలకమైన కామెంట్స్ చేశారు. అవి నాడు చర్చకు దారితీశాయి. నాడు కేటీఆర్ అన్న మాటలు చూస్తే ఆయనకు అమరావతిని కదిలించడం ఇష్టం లేదా అనిపించకమానదు. ఒక్క విమర్శ కూడా లేకుండా తెలంగాణాను ముప్పయి మూడు జిల్లాలుగా చేశామని, అదే ఏపీలో మాత్రం జనాలు వేరుగా స్పందిస్తున్నారని కేటీఆర్ నాడు అన్నారు. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా మూడు రాజధానులు జగన్ భుజాలకు ఎత్తుకున్నారన్నది కేటీఆర్ భావనగా నాడు ప్రచారం చేశారు. ఇపుడు ఇలా ఆయన విజయవాడే ఏపీకి దిక్సూచీ అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గతంలో కేసీఆర్ అమరావతి రాజధాని ప్రారంభోత్సవానికి వచ్చి దేశంలో మంచి రాజధాని అవుతుందని ఆకాంక్షించారు. మరి ఇవన్నీ చూసుకున్నపుడు పొరుగున ఉన్న తెలంగాణా పాలకులు ఏపీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని అనకతప్పదు.

ఒంటెద్దు పోకడ …..

ఇక కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి అమరావతిని కదపడం ఇష్టంలేదని అంటారు. ఇక టీఆర్ఎస్ వంటి నేస్తం అలాగే చెబుతోంది. మరో వైపు మూడు రాజధానులు అన్న దగ్గర నుంచి జగన్ గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గుతోంది. దానికి తోడు అన్నట్లుగా కరోనా మహమ్మారి వచ్చి జగన్ ప్రతిపాదనలు ఏవీ ముందుకు సాగకుండా బ్రేకులేసింది. ఇపుడు కరోనా తగ్గినా కూడా ఆర్ధికంగా శక్తి కూడదీసుకునేందుకు బాగా టైం పడుతుంది. మొత్తానికి అన్ని వైపుల నుంచి కూడా ఇలా మూడు రాజధానులకు వ్యతిరేకత రావడంతో జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటున్నారు. జగన్ సైతం ఇపుడు ఏమీ చేయలేని స్థితిలోనే ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే అంతా విజయవాడనే ఏపీకి ఆర్ధిక చోదక శక్తి అంటున్నారు. ఇది వైసీపీ పెద్దలు గమనిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News