లోటస్ పాండ్… టోటల్ గా యాంటీ ?

లోటస్ పాండ్ అంటే జగనే గుర్తుకు వస్తాడు. ఆయన రాజెకీయం అంతా అక్కడ నుంచే మొదలైంది. జగన్ వ్యూహాలు, ఎత్తులూ, ఎత్తుగడలూ ఇవన్నీ కూడా లోటస్ పాండ్ [more]

Update: 2021-04-17 05:00 GMT

లోటస్ పాండ్ అంటే జగనే గుర్తుకు వస్తాడు. ఆయన రాజెకీయం అంతా అక్కడ నుంచే మొదలైంది. జగన్ వ్యూహాలు, ఎత్తులూ, ఎత్తుగడలూ ఇవన్నీ కూడా లోటస్ పాండ్ వేదికగానే సాగాయి. లోటస్ పాండ్ నుంచే జగన్ అద్భుతమైన విజయాన్ని అందుకుని ఏపీ సీఎం గా అవతరించాడు. అటువంటి లోటస్ పాండ్ ఇపుడు యాంటీ జగన్ అంటోందా. అంటే సమాధానం మాత్రం అవును అనే వస్తోంది. జగన్ ఎక్కడ నుంచి తన రాజకీయ పోరటాన్ని మొదలుపెట్టాడో అదే ప్లేస్ నుంచి చెల్లెలు షర్మిల తన సమరానికి శ్రీకారం చుడుతోంది. షర్మిల నడుం బిగించి ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో తానూ ఉన్నాను అంటోంది. కేసీయార్ మీద ఆమె నిప్పులు చెరుగుతోంది.

కేసీయార్ తో దూరం….

కేసీయార్ ని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ ఇంతలా విమర్శలు చేయలేదు, కానీ షర్మిల మాత్రం చాలా సులువుగానే విమర్శలు సంధిస్తోంది. ఇదిలా ఉంటే కేసీయార్ కి జగన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇపుడు షర్మిల మూలంగా అవి చెడిపోతాయని అంటున్నారు. అదే సమయంలో సాక్షీ మీడియాకు వ్యతిరేకంగా షర్మిల గళం విప్పుతున్నారు. తన పోరాట కార్యక్రమాలను అసలు కవర్ చేయడంలేదని ఆమె బాధగా ఉంది.

చెంగు బిగించిన చెల్లెమ్మలు :

ఇక షర్మిల పోరాటానికి జగన్ మరో సోదరి దారుణ హత్యకు గురి అయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా హాజరు కావడం చూస్తూంటే యాంటీ జగన్ వెదికగానే లోటస్ పాండ్ కనిపిస్తోంది అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ గెలుపు ఆనందం ఎక్కువ కాలం మిగలకుండా ఫ్యామిలీలో కొంతమంది ఆయనకే ఎదురు తిరుగుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. మరో వైపు షర్మిలను జగన్ దూరం చేసుకోకుండా ఉండాల్సింది అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి బయట శత్రువులు కంటే ఇంటి వారే ఎదురు నిలుస్తారా, భవిష్యత్తులో వారి నుంచే ఇబ్బందులు ఎదురు అవుతాయా అన్న మాట అయితే చర్చగా ఉంది.

ఏపీలోనూ ప్రభావం….

ఇక ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో కూడా షర్మిలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలంగాణాలో పోరాటం చేస్తున్నా మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఆమె జగన్ కి వ్యతిరేకమని ఏ మాత్రమైన గట్టి సంకేతాలు కనుక వస్తే ఏపీలో వైసీపీకి కూడా అది అతి పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ఈ విషయంలో మొండి అనే అంటున్నారు కాబట్టి చెల్లెలు జగ మొండి అని చెప్పాలేమో. మరి ఈ అన్నా చెల్లేళ్ళ పంతాలు ఏపీలో బంగారం లాంటి రాజకీయ అవకాశాలను నేలపాలు చేసుకునేలా సాగుతాయా అన్న భయాలు కూడా వైసీపీ అభిమానులలో ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News