జగన్ ను ఇప్పట్లో టచ్ చేయలేరా …?
అదిగో జగన్ ను జైల్లో వేసేస్తున్నారు. ఇదిగో పెద్దిరెడ్డి వంటివారు సిఎం రేసులో లైన్లో ఉన్నారు అంటూ ఎల్లో మీడియా స్థానిక ఎన్నికల ముందు నానా గగ్గోలు [more]
అదిగో జగన్ ను జైల్లో వేసేస్తున్నారు. ఇదిగో పెద్దిరెడ్డి వంటివారు సిఎం రేసులో లైన్లో ఉన్నారు అంటూ ఎల్లో మీడియా స్థానిక ఎన్నికల ముందు నానా గగ్గోలు [more]
అదిగో జగన్ ను జైల్లో వేసేస్తున్నారు. ఇదిగో పెద్దిరెడ్డి వంటివారు సిఎం రేసులో లైన్లో ఉన్నారు అంటూ ఎల్లో మీడియా స్థానిక ఎన్నికల ముందు నానా గగ్గోలు పెట్టేసింది. కట్ చేస్తే పుర ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగడం వైసిపి సునామి సృష్ట్టించి 52 శాతం ఓట్ల తో తన తడాఖా చూపిస్తే ,టిడిపి గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల షేర్ ను సైతం భారిగా పతనం చేసుకుని 30 శాతానికి పడిపోయింది. ఇక జనసేన పరిస్థితి గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మరింత దిగజారిపోయింది. అయితే బిజెపి గతం కంటే కొద్దిగా మెరుగు పడటం గమనార్హం. కానీ జనసేన ప్లస్ బిజెపి ఓట్ల శాతం కలిపినా కూడా 2019 ఎన్నికల ఓట్ల శాతం లోపే పడిపోవడం ఆ రెండు పార్టీల్లో ఆందోళన కలిగిస్తుంది.
ప్రజా బలం ఉన్నంతకాలం …
ఈ నేపథ్యంలో జగన్ పై ఉన్న కేసుల్లో కేంద్రం ముందడుగు వేసే సాహసం చేసే ఛాన్స్ లేనేలేదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ప్రజాబలమే జగన్ పై చర్యలకు బ్రేక్ వేసేలా చేసే అస్త్రమని అంటున్నారు విశ్లేషకులు. పంచాయితీ, పుర ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రాష్ట్రం నలుమూలల స్వీప్ చేసి ప్రత్యర్థులను దరిదాపుల్లోకి రాకుండా తొక్కేసింది. దాంతో బిజెపి వ్యూహాలు కూడా ఇకపై మారతాయా అన్నది చర్చనీయం అవుతుంది. వైసిపి తో కయ్యం కన్నా లోపాయికారి అవగాహనతోనే ముందుకు వెళ్ళడం రెండు పార్టీలకు ఉభయతారకమని భావించి కమలనాధులు ముందుకు వెళతారని అంటున్నారు.
మరింత బలహీనం కావడంతో….
మరోపక్క టిడిపి మరింత బలహీనపడిన నేపథ్యంలో ఆ పార్టీతో జతకట్టే ఆలోచన సైతం మోడీ సర్కార్ చేసే ఛాన్స్ లేనేలేదంటున్నారు. బాబు గ్రాఫ్ వచ్చే రోజుల్లో ఇంకా కిందకు దించితేనే తమకు ప్రత్యామ్నాయ శక్తిగా అవకాశం దక్కుతుందన్న లెక్క ఎపి కాషాయ దళంలో ఉన్నా కేంద్రంలో మోడీ సర్కార్ మాత్రం పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలు కమలం క్యాడర్ ఆశలపై నీళ్ళు చల్లేస్తున్నాయి. వైసీపీకి సమీప దూరంలోకి సైతం భవిష్యత్తులో కూడా ఏ పార్టీ చేరే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ జగన్ ను టచ్ చేయడం ఇప్పట్లో సాధ్యమే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.