ఈ ఇద్దరు మంత్రుల‌ పీఠాల‌కు ఎస‌రు… హీటెక్కిన టాక్ ?

రాష్ట్ర కేబినెట్‌లోని పాతిక మంది మంత్రుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాగా, ఒక‌రు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి [more]

Update: 2021-06-30 05:00 GMT

రాష్ట్ర కేబినెట్‌లోని పాతిక మంది మంత్రుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాగా, ఒక‌రు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. అయితే.. ఇద్దరు ఎస్సీ మ‌హిళా మంత్రులు ఉండి కూడా ఆశించిన విధంగా పార్టీకి మైలేజీ రావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికి మంత్రులుగా బాధ్యత‌లు చేప‌ట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. అయిన‌ప్పటికీ.. ఇప్పటి వ‌ర‌కు వైసీపీకి మైలేజీ వ‌చ్చేలా ఇద్దరు మ‌హిళా నేత‌లు వ్యవ‌హ‌రించ‌లేక పోయార‌ని వైసీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్రధాన కార‌ణం కూడా ఉంది.

మంత్రి పదవుల కోసం….

త్వర‌లోనే సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేస్తార‌నే విష‌యం హ‌ల్చల్ చేస్తోంది. గ‌తంలో ఆయ‌న ఇచ్చిన మాట ప్రకారం చేసిన వాగ్దానం ప్రకారం.. ఈ ఏడాది చివ‌రి నాటికి అంటే.. రెండున్నరేళ్ల త‌ర్వాత‌.. మంత్రివ‌ర్గంలో 90 శాతం మందిని మార్చుతార‌ని చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే..దీనిపై క్లారిటీ లేకపోయినా.. అంటే.. క‌రోనా నేప‌థ్యంలో మార్పు క‌ష్టమేన‌ని కొంద‌రు… మార్పు ఉంటుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఈ క్రమంలో మంత్రివ‌ర్గ మార్పుపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలావుంటే.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన అనంత‌పురానికి చెందిన ఒక మ‌హిళా ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ‌ధాని ప్రాంతానికే చెందిన మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే మంత్రి పీఠాల కోసం విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నారు.

ఆ ఇద్దరిపైనే…?

ప్రస్తుతం మ‌హిళా మంత్రులుగా ఉన్న వారిలో ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రులు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని.. వారివ‌ల్ల అటు ప్ర‌భుత్వానికి, ఇటు పార్టీకి కూడా ఉప‌యోగం లేద‌ని వైసీపీలోని ఉన్నత వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ..! జ‌గ‌న్ ఈ వ‌ర్గం నుంచే ఇద్దరు మ‌హిళా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారంటే జ‌గ‌న్ ఖ‌చ్చితంగా వారి వ‌ల్ల పార్టీకి ఎంత మైలేజ్ వ‌స్తుంద‌ని చాలా లెక్కలు వేసుకుంటారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇద్దరు మంత్రుల విష‌యంలో సంతృప్తిగా లేర‌నే తెలుస్తోంది. వీరి వ‌ల్ల ఉప‌యోగం లేద‌న్న వ్యతిరేక ప్రచారం.. వైసీపీలోనే ఎక్కువ‌గా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

విస్తరణలో ఊడటం….

మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ఈ ఇద్దరు మంత్రుల‌కు చెక్ పెడ‌తార‌ని.. కొంద‌రు అంటుంటే.. అలాంటిది ఉండ‌ద‌ని.. ఒక‌వేళ చెక్ పెట్టినా.. ప్రస్తుతం పీఠాలు ఆశిస్తున్న వారిలో ఒక్కరికి మాత్రమే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. విచిత్రం ఏంటంటే తానేటి వనిత నియోజ‌క‌వర్గంలో వైసీపీ శ్రేణులే మా ఎమ్మెల్యేకు మ‌ళ్లీ ప‌ద‌వి రెన్యువల్ అవుతుంద‌న్న ఆశ‌లు లేవు.. ఆ ఆస‌క్తి కూడా ఆమెకు లేద‌ని చెపుతున్నారు. సుచ‌రిత ప‌ద‌వి ఉండ‌ద‌ని ప్రచారం జ‌రుగుతున్నా ఆమె లాబీయింగ్ అయితే మొద‌లు పెట్టేశార‌ని అంటున్నారు.

Tags:    

Similar News