జగన్ క్యాబినెట్ మార్పు ఎప్పుడంటే …?

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయింది. మరో ఆరునెలల్లో మంత్రి వర్గ మార్పు చేర్పులు ఉంటాయని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తన క్యాబినెట్ టీం రెండున్నరేళ్ళు మాత్రమే [more]

Update: 2021-08-02 08:00 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయింది. మరో ఆరునెలల్లో మంత్రి వర్గ మార్పు చేర్పులు ఉంటాయని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తన క్యాబినెట్ టీం రెండున్నరేళ్ళు మాత్రమే పదవుల్లో ఉండబోతున్నట్లు ప్రమాణ స్వీకారం నాడే జగన్ ప్రకటించారు. దాంతో మంత్రి పదవి తొలి క్యాబినెట్ లో దక్కని చాలామంది ఆశావహులు రెండున్నరేళ్ల సమయం ఎప్పుడు పూర్తి అవుతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు దగ్గరపడింది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల పందేరాన్ని జగన్ మొదలు పెట్టేశారు. దాంతో ఇప్పుడు వైసీపీ లో ఎన్నడు లేనంత జోష్ కనిపిస్తుంది.

ఇప్పుడు కాదు …

కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా మంత్రులు తమ బాధ్యతలను నిర్వర్తించింది ఏమీ లేదు. దాంతో ఎదో ఉన్నాం పోయాం అనుకోవడానికి తప్ప ఈ పదవి లో సంతృప్తి లేదని పలువురు అధిష్టానం దగ్గర ఇటీవల వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. వారి బాధను అర్ధం చేసుకున్న అధినేత జగన్ రెండున్నరేళ్ళ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించి అప్పుడు కొత్త టీం తో ఎన్నికలకు వెళ్లాలని జగన్ యోచన చేస్తున్నట్లు వైసిపి లో చర్చ సాగుతుంది. ఇటీవల జగన్ నిర్వహించిన క్యాబినెట్ భేటీ లో సమావేశం ముగిశాకా ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా ఈ మాట చెప్పినట్లు తెలుస్తుంది.

వత్తిడి పెరుగుతోందా?

151 సీట్లతో బంపర్ విక్టరీ తో అధికారంలోకి వచ్చినా అంతే స్థాయిలో మంత్రి పదవులపై పార్టీ నేతల వత్తిడి అధినేతపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరిని సంతృప్తి పరిచేందుకే జగన్ రెండున్నరేళ్లు స్కిం ప్రకటించి ఆ వత్తిడిని నాడు అధిగమించారు. ఇప్పుడు తిరిగి కాలం సమీపిస్తున్న పరిస్థితుల్లో కొత్త టీం కూర్పు కి మరికొంత సమయం తరువాత కొత్త క్యాబినెట్ కూర్పు చేయనున్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు మరో ఏడాదిపాటు ప్రస్తుత మంత్రులు కరోనా గిఫ్ట్ గా తమ పదవుల్లో హ్యాపీగా ఉండొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News