ys jagan : చిక్కులు తెచ్చినా ఓట్లు కురిపిస్తుందా?

రాజధాని వ్యవహారం జగన్ కు చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. మూడు రాజధానులంటూ ముందుకు వచ్చిన జగన్ న్యాయస్థానాలు కళ్లెం వేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు [more]

Update: 2021-10-15 06:30 GMT

రాజధాని వ్యవహారం జగన్ కు చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. మూడు రాజధానులంటూ ముందుకు వచ్చిన జగన్ న్యాయస్థానాలు కళ్లెం వేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతుంది. మరో మూడేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. మూడు రాజధానుల ప్రకటన చేసి ఇప్పటికే పదిహేను నెలలు కావస్తుంది. అయితే ఇంచుకూడా అడుగు ముందుకు పడలేదు. అమరావతి నుంచి రాజధానిని తరలించడం అంత సాధ్యం కాదన్నది న్యాయ నిపుణుల అంచనా.

రెగ్యులర్ విచారణకు…

నవంబరు పదిహేను నుంచి రెగ్యులర్ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అంటే మరో రెండు నెలల్లో విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఈ వివాదం న్యాయస్థానాల్లో ఇప్పట్లో తొలిగేది కాదు. ఇక్కడ ప్రభుత్వానికి రైతులు ఉచితంగా భూములు ఇచ్చారు. వారితో ప్రభుత్వం అగ్రిమెంటు చేసుకుంది. ఆ అగ్రిమెంట్లలో కౌలుతో ప్రకారం డెవెలెప్ చేసిన భూమిని కేటాయిస్తామని పేర్కొంది.

న్యాయరాజధాని విషయంలోనూ…

దీనిపై రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండానే రెండేళ్ల కాలం గడిచిపోయింది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత పెట్టుబడులు పూర్తిగా మందగించాయి. పరిపాలన రాజధాని విశాఖకు వెళ్లే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఇక న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. తిరిగి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.

ఎన్నికలకు వెళ్లాలంటే?

ఇప్పటికే న్యాయస్థానాల్లో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక కేసుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి రాజధానిగానే జగన్ 2024 ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. జగన్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండానే ప్రజాక్షేత్రంలో కాలు మోపాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితి జగన్ ను మరింత ఇబ్బంది పెట్టనుంది. మరి మూడు రాజధానుల అంశం లేకుండానే జగన్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News