Ys jagan : వారిద్దరినీ ఆ రెండు పదవులకూ ఫిక్స్ చేశారా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఛైర్మన్ షరీఫ్ పదవీ కాలం ముగిసింది. కొత్త ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలసి ఉంది. ఈ నెల 17 [more]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఛైర్మన్ షరీఫ్ పదవీ కాలం ముగిసింది. కొత్త ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలసి ఉంది. ఈ నెల 17 [more]
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఛైర్మన్ షరీఫ్ పదవీ కాలం ముగిసింది. కొత్త ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలసి ఉంది. ఈ నెల 17 వతేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాల జరగనున్నాయి. 19వ తేదీన ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఈ సమావేశాల్లోనే మండలి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లను ఎంపిక చేయనున్నారు. జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సామాజికవర్గం కోణంలోే….
జగన్ ప్రతి పదవినీ సామాజికవర్గాల కోణంలో చూసి భర్తీ చేస్తున్నారు. శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు కూడా కేబినెట్ ర్యాంకు కావడంతో ముఖ్యమైన నేతలను ఎంపిక చేసే అవకాశముంది. శాసనమండలిలో క్రమంగా వైసీపీకి బలం పెరుగుతుండటంతో ఆ పార్టీకి చెందిన నేతలకే రెండు పదవులు దక్కుతాయి. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బలం 18 మాత్రమే ఉన్నా ఖాళీలు భర్తీ అయితే ఆ సంఖ్య 32కు చేరుకోనుంది.
ఆయనకే అవకాశం….
అందుకే శాసనమండలి ఛైర్మన్ పదవిని జగన్ ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. కొత్త ఛైర్మన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషేన్ రాజును ఎంపిక చేసే అవకాశముందంటున్నారు. మండలిలో దళితులకు ప్రాధాన్యం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. శాసనసభలో స్పీకర్ గా బీసీలకు, డిప్యూటీ స్పీకర్ గా అగ్రవర్ణాలకు చెందిన వారున్నారు. శాసనమండలిలో దళితులకు ఛైర్మన్ పదవి ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలిసింది.
రెండో పదవి…..
అలాగే డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా మైనారిటీలకు ఇచ్చే అవకాశముంది. గత తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు ఇవ్వడంతో ఇప్పుడు జగన్ కూడా డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనారిటీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే జగన్ మనసులో ఏముందో తెలియక పలువురు నేతలు తమకు పదవి కావాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తం మీద కీలక పదవులను భర్తీ చేసే సమయం దగ్గరపడటంతో ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్ నేతల్లో మొదలయింది.