Ys jagan : అన్నీ తెలిసినా… ఇలా ఎందుకోమరి?
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదన్న సంగతి తెలుసు. బీజేపీని మరో మూడేళ్ల కాలంలో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టలేమని తెలుసు. అయినా ప్రత్యేక హోదా డిమాండ్ [more]
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదన్న సంగతి తెలుసు. బీజేపీని మరో మూడేళ్ల కాలంలో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టలేమని తెలుసు. అయినా ప్రత్యేక హోదా డిమాండ్ [more]
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదన్న సంగతి తెలుసు. బీజేపీని మరో మూడేళ్ల కాలంలో రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టలేమని తెలుసు. అయినా ప్రత్యేక హోదా డిమాండ్ ను జగన్ మరోసారి తెరపైకి తెస్తున్నారు. అడిగితే పోయేదేముంది అన్న తరహాలోనే జగన్ వ్యవహారం ఉంది తప్ప తొలి నుంచి ప్రత్యేక హోదాపై పోరాడింది పెద్దగా ఏమీలేదు. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక హోదాకు ఫుల్ స్టాప్ పడింది.
చంద్రబాబు నాడు…
నాడు చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఆడిన డ్రామాను గమనించి ఆయనను అధికారంలోకి రాకుండా పక్కన పెట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, అవసరమైతే రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్, ఎన్నికలకు ఏడాది ముందు తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ బలంగా ఉందని, ఇప్పుడు చేయగలిగేందేమీ లేదని జగన్ చేతులెత్తేశారు.
ఇవ్వరని తెలిసీ…
ప్రధాని మోదీని కలసినప్పుడల్లా జగన్ అందించే వినతిపత్రాల్లో ఇది కూడా ఒకటుంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చాలా సమస్యలున్నాయి. అది 2014లోనే సాధ్యం కావాల్సి ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనడంపై ఇప్పటికే అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. వారిని కాదని మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇస్తుందని ఆశించలేం. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా అంతే.
మరోసారి తెరపైకి….
కానీ ఏపీలో ప్రత్యేక హోదా శాశ్వత డిమాండ్ గా రాజకీయాల్లో మిగిలపోక తప్పదు. తాజాగా జగన్ కూడా ప్రత్యేక హోదాను మరోసారి తెరపైకి తెచ్చారు. ఈనెల 14వ తేదీన తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ప్రస్తావించాలని నిర్ణయించారుక. అయితే ఇది సాధ్యం కాదని తెలిసినా.. జగన్ మాత్రం ఎన్నికల సమయంలో దీనిపై మరోసారి వేడి పుట్టించేందుకు రెడీ అవుతున్నారని మాత్రం అర్థమవుతుంది.