వాళ్లనసలు పట్టించుకోరా? వారు పార్టీలో ఉన్నారని గుర్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుల పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగా లేదు. [more]

Update: 2020-10-07 00:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యుల పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగా లేదు. ఏ ఎంపీని చూసినా ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సహజంగా ఎంపీలంటే ఎమ్మెల్యేలు గౌరవిస్తారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు తమ నియోజకవర్గాలకు కేటాయించాలిన ఎంపీలను ఎమ్మెల్యేలు ప్రాధేయపడటం కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం.

ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు…..

కానీ ఏపీలో ఎంపీలు మాత్రం వారిచ్చే నిధుల కోసం కూడా చూడటం లేదు. భవిష్యత్ లో తమ అవసరం ఎంపీలకు ఉంటుందన్న ధైర్యంతోనే ఎమ్మెల్యేలు ఉన్నారన్నది స్పష్టమవుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన వివాదాన్ని పార్టీ అధిష్టానం కూడా చూసి చూడనట్లు వదిలేయడంతో సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ఎంపీలు నేరుగా ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నది వాస్తవం.

సీనియర్ నేత మాగుంట…..

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్ నేత. ఆయన ఎంపీగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలను చేపట్టారు. కానీ మాగుంట మాట వినే ఎమ్మెల్యేలే లేరు. కనీసం ఆయనను కలసి తమ నియోజకవర్గంలోని సమస్యలను గురించి మాట్లాడేంత తీరికా ఎమ్మెల్యేలకు లేదు. నియోజకవర్గాల్లో మాగుంటకు ప్రత్యేక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ను కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మాగుంట మదన పడుతున్నారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా…..

అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పరిస్థితి కూడా అంతే. ఆయనతో కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టే పనులను కూడా ఉషశ్రీ చరణ్ తన అనుచరులకే ఇస్తుండటం, ఎంపీ తలారి రంగయ్య సిఫార్సులను పట్టించుకోక పోవడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ ఎంపీ సిఫార్సులను బేఖాతరు చేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలకు కూడా ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మింగుడు పడటం లేదు. దీంతో ఎంపీలు ఎమ్మెల్యేల తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా జగన్ ఎంపీల సమస్యలపై దృష్టిపెడితేనే విభేదాలు సమసిపోతాయి. లేకుంటే భవిష్యత్ లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Tags:    

Similar News