జగన్ ధైర్యం అదేనట.. వారికి పూర్తి భరోసా

అమరావతి ఇపుడు అందరి నోటా అదే మాట. అమరావతి రాజధానిని తరలించుకుపోతున్నారని టీడీపీ గోల పెడుతోంది. కానీ అమరావతి రాజధాని ఎక్కడికీ వెళ్లలేదని, అక్కడే ఉందని, కాకపోతే [more]

Update: 2020-08-12 13:30 GMT

అమరావతి ఇపుడు అందరి నోటా అదే మాట. అమరావతి రాజధానిని తరలించుకుపోతున్నారని టీడీపీ గోల పెడుతోంది. కానీ అమరావతి రాజధాని ఎక్కడికీ వెళ్లలేదని, అక్కడే ఉందని, కాకపోతే మరో రెండు రాజధానులు అదనంగా వస్తున్నాయని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. అమరావతి తన ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని కూడా గట్టి హామీ ఇస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ చంద్రబాబు కంటే బాగా డెవలప్ చేస్తారని మంత్రి అనిల్ కుమార్ అంటున్నారు. అమరావతి ప్రజలు కూడా మావారే, వారిని మేము ఇంకా బాగా చూసుకుంటామని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.

తిప్పుకోవాలనే …

నిజానికి అమరావతిలో ఒక సామాజికవర్గం పెత్తనం ఉందని వైసీపీ అనుమానం. రాజకీయంగా చూసుకున్నా వారిదే హవా. ఒకే రాజధానిగా అమరావతిని ఉంచుతూ అక్కడ ఏమి చేసినా కూడా ఆ క్రెడిట్ చంద్రబాబుదే తప్ప జగన్ కి రాదు. అందువల్లనే మరో రెండు రాజధానుల పేరిట జగన్ కధ నడిపారని అంటారు. ఇక మిగిలిన అమరావతి ముక్కను కూడా రాజధానిగా చూస్తున్నారు. అయితే ఇపుడు జగన్ మీదనే పూర్తిగా అమరావతి ప్రాంతం ఆధార పడాల్సి ఉంది. జగన్ దయలేకపోతే అమరావతి అభివృధ్ధి అన్నదే ఉండదు, దాంతో జగన్ సర్కార్ తోనే అంతా జరుగుతుందని వారు నమ్మాలి. అదే ఇపుడు జగన్ స్ట్రాటజీ కూడా.

ఆ ఒక్కటీ తప్ప …

అమరావతిలో ప్రగతి చేసి చూపిస్తామని మంత్రులు అంటున్నారు. అయితే వారు పోరాటాలు ఉద్యమాలు ఊసు మరచిపోవాలి. విపక్షాలను నమ్ముకోవడం, రెచ్చగొట్టే ప్రకటనలు కూడా మానుకోవాలి. అపుడే వారికి న్యాయం జరుగుతుంది. ఇక జగన్ సైతం అమరావతికి చేయాల్సింది చేస్తానని అంటున్నారు. అందుకే సీఆర్డీయే ను రద్దు చేసిన తరువాత అమరావతి మెట్రో సిటీ డెవలప్మెంట్ రీజియన్ పేరిట కొత్తగా సంస్థను తెచ్చారు. మరింత పరిధిని పెంచుతూ అక్కడ ఫుల్ డెవలప్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భవనాలు ఉన్నాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం, అక్కడ అంతా కూడా మెట్రో సిటీ మాదిరిగా డిజైన్ చేయడం వంటివి జగన్ సర్కార్ చేయాలనుకుంటోంది.

అదే భరోసా….

ఏపీలో రాజ్యం వైసీపీది, ఏం చేసినా తమ ప్రభుత్వమే చేస్తుందని అమరావతి సహా అందరూ నమ్మాలి. ఇదే జగన్ ఆలోచన. మరో వైపు గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు 29 దాకా గెలిచిన వారు ఉన్నారు. వారంతా కూడా తాజా పరిణామాలపైన మదనపడుతున్నారు. వారికి కూడా జగన్ చెప్పినది ఒక్కటే.తాను అంతా చూసుకుంటానని. ఇంకా నాలుగేళ్ల కాలం ఉంది. ఈలోగా ఈ జిల్లాలను ఒడిసిపట్టి తన అభివఋధ్ధి మంత్రంతో మళ్ళీ వైసీపీ వైపు వారు తిరిగేలా చూసుకుంటానని జగన్ గట్టిగానే చెబుతున్నారు. ఇటు ప్రజలకు, అటు ఎమ్మెల్యేలకు కూడా జగన్ ఇస్తున్న ఈ భరోసా ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఇందులో కనుక జగన్ సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు, ఇతర పార్టీలకు ఏపీలో గడ్డు రోజులేనని చెప్పకతప్పదు.

Tags:    

Similar News