ఇళ్ళపట్టాల పంపిణీ బ్రేక్ కి రీజన్స్ ఇవేనా …?

వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ కి బ్రేక్ ల పై బ్రేక్ లు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లక్షలమంది అర్హులైన పేదలకు ఒకేసారి ఇంటికోసం భూమిని [more]

Update: 2020-07-07 09:30 GMT

వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ కి బ్రేక్ ల పై బ్రేక్ లు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లక్షలమంది అర్హులైన పేదలకు ఒకేసారి ఇంటికోసం భూమిని పంచిపెట్టాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. మొన్నటి ఉగాది నాడే పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న జగన్ సర్కార్ కి కరోనా దెబ్బ కొట్టేసింది. ఆ తరువాత అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న పంపిణీ కి రెడీ అయ్యింది ప్రభుత్వం. అదీ వాయిదా పడింది. ఇక వైఎస్ఆర్ జయంతి జులై 8 న ఈసారి గ్యారంటీ అనుకున్నారు అంతా. అయితే ఈసారి ఆ ముహూర్తం సెట్ కాలేదు. ఇక ఆగస్టు 15 న మరో తేదీ ప్రకటించారు సర్కార్ పెద్దలు.

సమయం చాలడం లేదా …

ఆదరా బాదరాగా ప్రభుత్వం లక్షల మందికి ఒకేసారి పట్టాలు అందించాలనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ భూములను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసేసింది. అయితే కొన్ని చోట్లా ఇంకా భూ వివాదాలు కొలిక్కి రాలేదని సమాచారం. దాంతో కొన్ని చోట్ల ఆవభూముల వంటి సమస్యలు, ఇంకొన్ని చోట్ల ధరల నడుమ వ్యత్యాసాలు, మరికొన్ని ప్రాంతాల్లో కోర్ట్ కేసులు వెరసి పట్టాల పంపిణి కి అడుగడుగునా అనేక సమస్యల సుడిగుండాలు ఏర్పడ్డాయి.

అందుకేనా?

దీనికి తోడు ప్రధాన విపక్షం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ ఇళ్ల స్థలాల్లో అవినీతిపై నిరసనలకు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఆచితూచి పంపిణీ చేసేందుకు సర్కార్ డిసైడ్ అయ్యింది. కరోనా కారణంగా భూముల పంపిణీ ఆగిందన్నది పైకి చెబుతున్నా ఆగస్టు లో మరింతగా కేసులు పెరుగుతాయని కేంద్ర నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పట్టాల పండగ మరోసారి వాయిదా పడుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News