జగన్ కి నిద్రపట్టడం లేదా …?

వైసిపిని అద్భుత మెజారిటీ తోకష్టపడి అధికారంలోకి తీసుకువచ్చారు వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని గెల్చిన వెంటనే ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా తన [more]

Update: 2019-08-08 08:00 GMT

వైసిపిని అద్భుత మెజారిటీ తోకష్టపడి అధికారంలోకి తీసుకువచ్చారు వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని గెల్చిన వెంటనే ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా తన మ్యానిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని తూచా తప్పకుండా చెప్పినవన్ని అమలు చేస్తానని మరోసారి ప్రకటించి ఆ దిశగా వేగంగానే అడుగులు వేస్తూ వస్తున్నారు. అన్ని బాగున్నా అల్లుడినోట్లో శని లా ఇప్పుడు రాష్ట్ర ఆర్థికపరిస్థితి దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు లా మారడంతో చంద్రబాబు మాదిరే ఢిల్లీ ప్రదక్షిణాలు చేయకతప్పడం లేదు ఎపి ముఖ్యమంత్రి జగన్ కి.

పైసలు లేవు ఏమి చేస్తాం … ?

ఆశలకు, అమలుకు చాలా అంతరం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైన నిధులు అయితే లేవు. అదే ఇప్పుడు ఎపి సర్కార్ కి సవాల్ విసురుతుంది. రెండు లక్షల 27 వేలకోట్లరూపాయలకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. నాలుగు త్రైమాసికాల్లో ఎపి ఖజానాకు వచ్చేది ఒక లక్ష 49 వేలకోట్లరూపాయలు దాంతో ఆదాయానికి అయ్యే ఖర్చుకు 78 వేల 400 కోట్ల రూపాయలను సూచిస్తుంది. దీనిని పూడ్చేందుకు తీసుకోవాలిసిన చర్యలపై వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలిసింది కూడా తగ్గడంతో లోటు బడ్జెట్ తో బండి ఎలా నడిపించాలన్న ప్రశ్న వైసిపి ప్రభుత్వానికి తలనొప్పి రప్పిస్తుంది. దాంతో రెండు రోజులపాటు అనుకున్న ఢిల్లీ టూర్ ను మరో రెండురోజులు పొడిగించుకుని మరీ ఎపి ముఖ్యమంత్రి హస్తినలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లా కేంద్ర మంత్రుల చుట్టూ సుడిగాలి పర్యటనలు చేయడానికి ఇదే కారణమని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే పులివెందుల, అనంతపురం పర్యటనలు సైతం వైఎస్ జగన్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

స్వయం సమృద్ధి సాధించకపోతే …

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం గా వుంది. పారిశ్రామిక ప్రగతి కొత్త రాష్ట్రంలో గత ఐదేళ్ళలో కాగితాలమీద తప్ప ఆచరణలో శూన్యమే అయ్యింది. ప్రత్యేక హోదా ప్రకటించి ఉంటే పెట్టుబడిదారులు ఎపి చుట్టూ తిరిగే అవకాశం ఉండేది. కానీ ఎలాంటి టాక్స్ రాయితీలు, బెనిఫిట్ లు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా కేంద్రం చుట్టూ రుణాలకు బ్యాంక్ ల చుట్టూ తిరగాలిసిన దుస్థితి. అందువల్ల ఆర్ధిక స్వయం సమృద్ధికి అవసరమైన మార్గాలపై ఎపి దృష్టి పెట్టాలి. వ్యవసాయం తరువాత పర్యాటకం ఏపీకి భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని సమకూర్చే అవకాశం వుంది. 960 కిలోమీటర్ల తీరప్రాంతం వున్న ఆంధ్రప్రదేశ్ లో బీచ్ టూరిజం పోర్ట్ ల అభివృద్ధికి అవకాశం వుంది. అపార సహజవాయు నిక్షేపాలు వున్న గ్యాస్ ఆయిల్ పై రాష్ట్రానికి రావలిసిన రాయల్టీ కోసం పోరాడితే ఆర్ధికంగా వనరులు పెంపొందుతాయి.

ఎకో టూరిజం కాసులు పండిస్తుంది ….

ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గోదావరి జిల్లాలు, ప్రకాశం, కర్నూలు లో వున్న నల్లమల్ల అటవీప్రాంతాల్లో ఎకో టూరిజం కాసులు కురిపించే మార్గం. హెలిటూరిజం, వంటివి ప్రోత్సహించాలిసి ఉంటుంది.ఇలా ఆదాయం తెచ్చిపెట్టే వాటికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తే ఎపి క్రమంగా అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతుంది. అలా కాకుండా రుణాల కోసం, కేంద్ర సాయం కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటే తెచ్చిన అప్పులకు వడ్డీలకు, సంక్షేమ పథకాలు జీతాలకు నిధులు లేక చతికిల పడే పరిస్థితి రావొచ్చన్నది నిపుణుల అంచనా.

Tags:    

Similar News