జగన్ నిర్ణయాన్ని మార్చుకుంటారా?
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కోసం పెద్ద కసరత్తే నడిచింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటే సుదీర్ఘ కసరత్తు చేసింది. విజయవాడ గుంటూరు ప్రాంతాలు తప్ప [more]
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కోసం పెద్ద కసరత్తే నడిచింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటే సుదీర్ఘ కసరత్తు చేసింది. విజయవాడ గుంటూరు ప్రాంతాలు తప్ప [more]
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కోసం పెద్ద కసరత్తే నడిచింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటే సుదీర్ఘ కసరత్తు చేసింది. విజయవాడ గుంటూరు ప్రాంతాలు తప్ప ఎక్కడ పెట్టినా మంచిదే అని మరీ మరీ చెప్పింది. దీనికి కారణాలను స్పష్టంగా పేర్కొంది కమిటీ. మూడు పంటలు పండే ప్రాంతం కావడం వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించేటప్పుడు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే చిత్రంగా నాటి చంద్రబాబు సర్కార్ శివరామకృష్ణన్ నివేదికను చెత్త బుట్టలో వేసేసింది. ఆ కమిటీ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టేసింది. ఎక్కడైతే కమిటీ వద్దని చెప్పిందో అక్కడే ఎపి రాజధాని అమరావతి అని ప్రకటించి ముప్ఫైవేలకు పైగా పంటభూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుని గ్రాఫిక్స్ తో ప్రజలకు ఇదిగో మన భూతల స్వర్గం అని తేల్చింది.
కృష్ణా వరదలు నిజం చేశాయిగా …
తాజాగా వచ్చిన కృష్ణా వరదలు శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికలు నిజమే అని రుజువు చేశాయి. కర్ణాటక, మహారాష్ట్ర లలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కింది. దశాబ్ద కాలం తరువాత పోటెత్తి ఉప్పొంగింది. అంతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంటలు, గ్రామాలు, లంక గ్రామాలు వరదలో మునిగాయి. అదృష్టం బావుండి కృష్ణకు వరద తాకిడి వచ్చిన సమయంలో అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో భారీ వర్షాలు లేవు. దాంతో అతి పెద్ద ప్రమాదమే తప్పింది విజయవాడకు. ఇక ఈ అంశాన్ని అధికార విపక్షాలు తమ యధా శక్తి రాజకీయానికి వినియోగించుకున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఇంత ప్రమాదకర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం భవిష్యత్తు ను ప్రమాదంలో పడేసేలాగే వుంది.
మరోసారి అధ్యయనం జరిపించాలి …
శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడంతో బాటు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేసి అమరావతి చుట్టూ వరద, వర్షాల ముంపునకు గురికాని ప్రాంతాలను గుర్తించాలి. ముఖ్యంగా ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా తట్టుకుని నిలబడే ప్రభుత్వ భూమిని అటు ప్రకాశం నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వరకు పరిశోధించి గుర్తించాలి. లేకపోతే ఏపీలో పరిశ్రమలు, విద్యాసంస్థలు , వైద్య సంస్థలు భవిష్యత్తు వరదలో నిండా మునిగే ప్రమాదం తప్పదంటున్నారు విశ్లేషకులు. దీనిపై విమర్శలు పెద్ద ఎత్తున రావడం తధ్యం. రాజధాని ప్రాతం ఎంపిక నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా గత ప్రభుత్వం మలుచుకుందని ఇన్ సైడ్ ట్రేండింగ్ కి పాల్పడిందని ఇప్పటికే అధికారంలోని వైసిపి సర్కార్ ఆరోపిస్తుంది. అది విచారణ కమిటీ నిజమని తెలిస్తే రాజధాని వికేంద్రీకరణ చేసి విశాఖ నుంచి తిరుపతి వరకు విస్తరించి సమతుల అభివృద్ధికి బాటలు వేయడానికి ఇదే తరుణమని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి జగన్ సర్కార్ నిర్ణయాలు ఎలా వుంటాయో వేచి చూడాలి.