భగీరథ ప్రయత్నానికి డిజైన్ రెడీ అయిందా …?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కె.చంద్రశేఖర్ రావులు గోదావరి ని శ్రీశైలం చేర్చేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ఎపి ఇంజనీర్లు తుది రూపం సిద్ధం [more]
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కె.చంద్రశేఖర్ రావులు గోదావరి ని శ్రీశైలం చేర్చేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ఎపి ఇంజనీర్లు తుది రూపం సిద్ధం [more]
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కె.చంద్రశేఖర్ రావులు గోదావరి ని శ్రీశైలం చేర్చేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ఎపి ఇంజనీర్లు తుది రూపం సిద్ధం చేసేసారు. ఈనెల 9 న ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు ఈ విషయంపై సమావేశం అయ్యారు. ఈనెల 15 న తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ వారం రోజల్లోపు గోదావరి జలాలను శ్రీశైలం తరలించేందుకు ఎపి ఇంజనీర్లు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు డిజైన్ రూపొందించేశారు. ఈ డిజైన్ పై తెలంగాణ ఇంజనీర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇరిగేషన్ వర్గాల సమాచారం.
నాలుగు చోట్ల ఎత్తిపోతలు ….
గోదావరి నీటిని కృష్ణకు తరలించేందుకు తెలంగాణ ప్రాంతంలోని నాలుగు చోట్ల ఎత్తిపోతలకు పంపు హౌస్ ల నిర్మాణం అవసరమని ఇంజనీర్లు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తుంది. గోదావరి ఇంద్రావతి కలిసే రాంపూర్ ప్రాంతం లో ఒక బ్యారేజ్ నిర్మించడం అక్కడి నుంచి లక్కవరం మీదుగా ఆ తరువాత కాకతీయ కాలువ ద్వారా అక్కడినుంచి మూసి మీదుగా శ్రీశైలం వరకు నీటిని తరలించాలని ప్లాన్ చేశారు. మొత్తం నాలుగు చోట్ల దీనికోసం పంప్ హౌస్ లు నిర్మించడంతో బాటు రెండు చోట్ల సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించాలని ఎపి ఇంజనీర్లు డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
305 మీటర్లు పైకి నీటిని తరలించాలి …
గోదావరి శ్రీశైలం చేరేందుకు 305 మీటర్ల మేరకు నీటిని ఎత్తిపోయాలిసి ఉంటుంది. అందులో రాంపూర్ లో 130 మీటర్ల మేర ఎత్తిపోతలు, మరో చోట 90 మీటర్ల మేర ఎత్తిపోతలు, ఇంకోచోట 40 మీటర్ల మేర చివరి పంప్ హౌస్ వద్ద 45 మీటర్ల మేర ఎత్తి నీటిని శ్రీశైలం చేర్చాలిసి ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలకు చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నం కావడంతో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఈ డిజైన్ పై తీవ్రంగా శ్రమిస్తున్నారు.