జగన్ చివరి నిమిషంలో..?

విశాఖ జిల్లా పాయకరావుపేటకు రాజకీయంగా ప్రాధ్యాన్యత ఉంది అక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచిన చెంగల వెంకటరావు బాలయ్యతో బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి తీసి ఓవర్ [more]

Update: 2019-10-02 14:30 GMT

విశాఖ జిల్లా పాయకరావుపేటకు రాజకీయంగా ప్రాధ్యాన్యత ఉంది అక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచిన చెంగల వెంకటరావు బాలయ్యతో బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి తీసి ఓవర్ నైట్ బిగ్ ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇక కాకర నూకరాజు అనేక సార్లు ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. జిల్లాపరిషత్ కార్యనిర్వహణ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న గొల్ల బాబూరావు కానీ, టీచర్ గా పనిచేస్తున్న వంగలపూడి అనిత కానీ హఠాత్తుగా ఎమ్మెల్యేలుగా అయ్యారంటే అది పాయకరావుపేట సీటు గొప్పతనమే. ఇక పాయకరావుపేటకు మరో విశేషం ఉంది. ఇది విశాఖకు చిట్టచివరి సరిహద్దు ప్రాంతం. అలాగే తూర్పుగోదావరి జిల్లాతో కలుస్తూ ఉండే పాయకరావుపేట మంత్రి పదవులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. ఎందుకంటే వేరుగా, దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో అటూ ఇటూ పదవులు భర్తీ అయిపోతాయి కాబట్టి.

సేమ్ సీన్ రిపీట్….

ఇక పాయకరావుపేటకు తిరుమల వెంకన్న అశీర్వాదం లేదా అన్న చర్చ ఈ మధ్య జోరుగా సాగుతోంది. అదెలా అంటే టీడీపీ టైంలో కానీ ఇపుడు జగన్ జమానాలో కానీ టీటీడీ పాలకమండలి సభ్యత్వం చేతిదాకా వచ్చి మరీ అందని పండు అయింది. అనితను టీడీపీ బోర్డ్ మెంబర్ గా చంద్రబాబు నియమించారు. అయితే ఆమె క్రిస్టియన్ అని ప్రచారం కావడంతో చివరి నిముషంలో రద్దు చేశారు. ఇక తాజాగా చూసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరు కూడా టీటీడీ పాలక మండలిలో ఖరారు చేసి మరీ అఖరి క్షణాన అయన్ని పక్కన పెట్టేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ విషయంలో చూసుకుంటే వెంకన్న సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం, అదృష్టం పేట ఎమ్మెల్యేలకు దక్కదా అన్న చర్చ సాగుతోంది.

పదవులు దూరమే….

ఇక పాయకరావుపేట ఎమ్మెల్యేలకు పదవులు దక్కిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. వారు ఏ జిల్లాకు చెందిన వారు అని పూర్తిగా చెప్పలేని పరిస్థితి. గోదావరి జిల్లా వారుగా విశాఖ వారు అనుకుంటారు. వారేమో సాంకేతికంగా విశాఖలో ఉన్నారు కాబట్టి ప్రాధాన్యత ఇవ్వరు. దాంతో ప్రాంతీయ సమతూకంలో కానీ, సామాజిక సమీకరణల్లో కానీ పాయకరావుపేట ఎమ్మెల్యేలు ఎపుడూ నష్టపోతున్నారన్న మాట వినిపిస్తుంది. భౌగోలికంగా అతి పెద్దదైన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల మధ్యలో సరిహద్దుల్లో ఈ సీటు ఉండడమే ఈ ఎమ్మెల్యేలు చేసిన పాపమా అన్న మాట కూడా ఉంది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు కాబట్టి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సీనియర్ నేత, నీతిగల నేతగా ఉన్న గొల్ల బాబూరావుకు మంచి నామినేటెడ్ పదవి దక్కుతుందన్న ఆశ మాత్రం ఆయన వర్గీయులతో పాటు, నియోజకవర్గం ప్రజలలో కూడా ఉంది. మరి చూడాలి బాబూరావు ఈ యాంటీ సెంటిమెంట్ ని ఎలా బ్రేక్ చేస్తారో.

Tags:    

Similar News