జగన్ అడుగులు ఏ దిశగా…?
పోలవరం. రాష్ట్రానికి జీవ నాడి. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చును, పెట్టిన పెట్టుబడులను, కాంట్రాక్టులను కూడా తాను వెలికి తీసి రివర్స్ [more]
పోలవరం. రాష్ట్రానికి జీవ నాడి. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చును, పెట్టిన పెట్టుబడులను, కాంట్రాక్టులను కూడా తాను వెలికి తీసి రివర్స్ [more]
పోలవరం. రాష్ట్రానికి జీవ నాడి. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చును, పెట్టిన పెట్టుబడులను, కాంట్రాక్టులను కూడా తాను వెలికి తీసి రివర్స్ టెండరింగ్ చేపడతానని ఇప్పటికే జగన్ చెప్పారు. అయితే, దీనికి సంబం ధించి.. ఇప్పటికే కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో జగన్ చేయాలని అనుకుంటున్న పని ముందుకు సాగుతుందా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు తుది అంచనాలు రూ.55,548.87 కోట్లకు పెంచుతూ, కేంద్రం కొన్ని రోజుల కిందట ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు అంచనాలకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘టీఏసీ’ ఆమోదముద్ర వేసిందని పార్లమెంటులో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం ఆమోదంతో….
ఈ సమాధానంపై వైసీపీ ఎంపీ విజయసాయి హర్షం వ్యక్తం చేశారు.అదేసమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థించాకే, పోలవరం అంచనాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవానికి దీనికి ముందు జరిగిన ఎపిసోడ్‌లో అంచనాలను పెంచడంపై జగన్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నుంచి దోచుకునేందుకు మాత్రమే చంద్రబాబు ఈ పెంపుదల చేపట్టారని విమర్శించారు. అయితే, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారిపోయింది. రాష్ట్రంలో భారీ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల టెండర్లపై సీఎం జగన్ పూర్తిస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు.
కమిటీ ఇచ్చిన నివేదికతో….
గత ప్రభుత్వం అయినవారికి అయాచితంగా టెండర్లను కట్టబెట్టిందని ఎన్నికల కు ముందు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే.. గత సర్కారు ఖరారు చేసిన టెండర్లపై అధ్యయనం చేసేందుకు రిటైర్ట్ ఇంజనీర్లతో కూడిన బృందాన్ని నియమించారు. ఈ బృందం ఇప్పటికే జల వనరులు, రహదారులు, మౌలిక సదుపాయాల పనుల టెండర్లపై అధ్యయనం ప్రారంభించింది. ఈ కమిటీ ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై తన ప్రాథమిక నివేదికను అందజే సింది. పోలవరం ప్రాజెక్టును లక్ష్యం మేరకు పూర్తి చేయాల్సి ఉన్నందున, త్వరితగతిన పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్లపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారో..?
పోలవరం అంశంపై అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయం జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని వెల్లడిస్తూనే.. తాను చేయాలనుకున్న విషయాన్ని ఆయన చెప్పాలి. అదే సమయంలో విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రాజెక్టుగా ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కేంద్రానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను కేంద్రం తోసిపుచ్చింది. మరి ఇప్పుడు జగన్ రివర్స్ టెండరింగ్ అంటే.. పోలవరం పరిస్థితి ఏమవుతుంది ? అనేది చూడాలి. ఆసక్తికరంగా ఉన్న పోలవరం ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.