వైఎస్సార్ లోని మరో కోణం… ఇదేనట ?

వైఎస్సార్ అంటే అందరికీ తెలిసినది ఏంటి అంటే ఆయన కరడు కట్టిన సమైక్యవాది అని. మీడియా సైతం అదే హైలెట్ చేస్తూ వచ్చింది. వైఎస్సార్ కూడా తాను [more]

Update: 2021-07-17 08:00 GMT

వైఎస్సార్ అంటే అందరికీ తెలిసినది ఏంటి అంటే ఆయన కరడు కట్టిన సమైక్యవాది అని. మీడియా సైతం అదే హైలెట్ చేస్తూ వచ్చింది. వైఎస్సార్ కూడా తాను బతికున్న రోజుల్లో ఎపుడూ విభజన గురించి గట్టిగా మాట్లాడింది లేదు. రాష్ట్రం కలిసుండాలనే ఆయన ఎపుడూ తపన పడేవారు అంటారు. ఇక వైఎస్సార్ 2009 ఎన్నికల వేళ తొలిదశలో తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఏపీలోని నంద్యాలకు వచ్చి చేసిన కామెంట్స్ ఆయనలోని సమైక్యవాదికి అద్దం పడతాయి. రాష్ట్రం విడిపోతే పాస్ పోర్టులు తీసుకునే తెలంగాణాకు వెళ్ళాలని కూడా ఆయన నాడు సంచలన వ్యాఖ్యలే చేశారు.

బ్రాండ్ ఇమేజ్ ….

వైఎస్సార్ అంటే పక్కా సమైక్యవాది అని ఏపీ జనం గాఢంగా నమ్ముతారు. తెలంగాణా రాజకీయ నాయకులు కూడా ఆ విషయంలోనే ఆయనతో విభేదిస్తారు. ఇక్కడ అంతా ఒక్క మాటను కూడా ఒప్పుకుంటారు. అదేంటి అంటే వైఎస్సార్ కనుక బతికి ఉంటే కచ్చితంగా ఏపీ విడిపోయేది కాదు అని. వైఎస్సార్ చనిపోయిన తరువాతనే అంతవరకూ స్తబ్దుగా ఉన్న తెలంగాణా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సంగతి కూడా చరిత్ర పుటలు చెబుతారు. అలాంటి వైఎస్సార్ ని తెలంగాణా వాది అని ఒప్పించడం బహు కష్టమైన విషయమే.

రాజకీయం కోసం ..?

ఇక తెలంగాణాలో పార్టీ పెట్టిన ఆయన తనయ షర్మిల తన రాజకీయం కోసం తండ్రి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారా అన్న అనుమానాలు గట్టిగా వస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణాను ఎపుడూ అడ్డుకోలేదని, ఆయన తెలంగాణా వాది అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు 41 మంది కాంగ్రెస్ నేతల చేత ప్రత్యేక తెలంగాణా డిమాండ్ మీద హై కమాండ్ కి లేఖలు రాయించారు అన్నది కూడా ఆమె ప్రస్థావించారు. దాని మీద ఈ రోజుకీ టీడీపీ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే వైఎస్సార్ పీసీసీ చీఫ్ గా నాడు తన బాధ్యతగా పార్టీ నేతల అభిప్రాయాన్ని మాత్రమే హై కమాండ్ కి చేరవేశారు తప్ప అది ఆయన సొంత భావన కాదు అని ఇప్పటికే చాలాసార్లు ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటిది వైఎస్సార్ మీద తెలంగాణా ముద్ర వేయడం కోసం షర్మిల ఈ విషయాన్ని వేరేలా చెబుతున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

ఇప్పటికే అలా…

కృష్ణా నదీ జలాల విషయంలో వైఎస్సార్ ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే దారుణమైన కామెంట్స్ చేశారు. నాడు నోరు విప్పి ఖండించని షర్మిల సడెన్ గా తెలంగాణా వాదన కరెక్ట్ అన్నట్లుగా కూడా ఈ మధ్యనే మాట్లాడారు. మొత్తానికి చూస్తే తండ్రి వైఎస్సార్ రెండు రాష్ట్ర ప్రజలకూ ఇష్టుడు, మెజారిటీ ప్రజలకు దేవుడు కూడా. అలాంటి ఆయనను తన రాజకీయం కోసం ఆమె తగ్గిస్తున్నారా అన్నది కూడా అభిమానుల ఆవేదనగా ఉంది. వైఎస్సార్ పక్కా సమైక్యవాది. అది నిజం. చరిత్రలో కూడా అదే ఉంటుంది. ఇక షర్మిల ఆయన తెలంగాణా వాది అంటూ ఎంతగా చెప్పినా అక్కడ నమ్మరు కదా ఏపీలో కూడా వైఎస్సార్ ఇమేజ్ డ్యామేజ్ అవడం ఖాయం. మొత్తానికి ఒక వైఎస్సార్ లో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయా అన్నదే డౌట్. మరి ఆయన రెండవ కోణం ఇదేనని తనయ చెబుతూంటే అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోందిట.

Tags:    

Similar News