విజయమ్మ జగన్ ను ఇరుకున పెట్టారా ?

వైఎస్ విజయమ్మ ఏపీ లోని వైఎస్సాఆర్ పార్టీకి ప్రస్తుతం కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె నేతృత్వంలోనే పార్టీ స్థాపన నుంచి నేటివరకు వైసిపి సాగుతుంది. అలాంటి విజయమ్మ [more]

Update: 2021-04-10 08:00 GMT

వైఎస్ విజయమ్మ ఏపీ లోని వైఎస్సాఆర్ పార్టీకి ప్రస్తుతం కూడా గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె నేతృత్వంలోనే పార్టీ స్థాపన నుంచి నేటివరకు వైసిపి సాగుతుంది. అలాంటి విజయమ్మ తెలంగాణ లో వైఎస్ షర్మిల కొత్తగా నెలకొల్పబోతున్న పార్టీ సన్నాహక కార్యక్రమంలో పాల్గొనడం ఫ్యాన్ పార్టీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ అయ్యింది. తన బిడ్డను దీవించాలంటూ కూడా విజయమ్మ ఈ సభలో స్పష్టంగా ప్రకటించారు కూడా. ఒక పక్క షర్మిల పార్టీ పెట్టడం వైఎస్ జగన్ కు ఇష్టం లేదు. ఇది రెండు రాష్ట్రాల నడుమ ఇబ్బందులు కలిగించే పరిస్థితి తెస్తుందన్నది జగన్ ఆలోచనగా ప్రచారం ఉంది. అలాంటి పరిస్థితిల్లో వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖమ్మం సభలో తన కుమార్తె పెట్టె కొత్త పార్టీకి శ్రీకారం చుట్టడం పై వైసిపి క్యాడర్ లో అయోమయం సృష్టించనుంది.

తల్లిగానే దీవించారా … ?

విజయమ్మకు జగన్ ఎంతో షర్మిల కూడా అంతే సమానం. అయితే ఆమె ఎపి లోని వైసిపి గౌరవాధ్యక్షురాలిగా లేకుండా ఉంటే దీనిపై చర్చ ఉండేది కాదు. కానీ జగన్ పెట్టిన వైసిపి కి గౌరవాధ్యక్షురాలిగా ఉండగానే ఈ పదవి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే షర్మిల సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కన్న తల్లిగా ఇద్దరి పిల్లల అభిప్రాయాలను ప్రోత్సహించాలిసిన అనివార్యస్థితి లో విజయమ్మ దీనిపై క్లారిటీ ఇచ్చి ఉండాలిసిందంటున్నారు.

ఆ హోదాలో….?

సభలో వైసిపి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ పాల్గొనలేదని స్పష్టం చేసి ఉంటె సరిపోయేదన్న వాదన వినవస్తుంది. ఒక పార్టీలో కీలక పదవిలో ఉండగానే మరో పిల్ల పార్టీని తన చేతుల మీదే పురుడు పోసేలా ఆమె చేయడం మరిన్ని విమర్శలకు తెరతీసేలాగే ఉంది. మరోపక్క విజయమ్మ తాజా డ్యూయల్ రోల్ ఎపి సిఎం వైఎస్ జగన్ కు రాజకీయంగా ఇరకాటంలో పెట్టేదే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News