వైఎస్సార్ లోని కొత్త కోణం… విజయమ్మ ఏమన్నారంటే?

వైఎస్సార్ జయంతి సందర్భంగా విజయమ్మ ఒక పుస్తకాన్ని రచించారు. భర్తగా, తండ్రిగా, పేదల పట్ల వైఎస్సార్ వ్యవహరించిన తీరును విజయమ్మ పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెచ్చారు. [more]

Update: 2020-07-08 02:00 GMT

వైఎస్సార్ జయంతి సందర్భంగా విజయమ్మ ఒక పుస్తకాన్ని రచించారు. భర్తగా, తండ్రిగా, పేదల పట్ల వైఎస్సార్ వ్యవహరించిన తీరును విజయమ్మ పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా 37 ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ పుస్తకాన్ని విజయమ్మ రూపొందించారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు అందించిన సేవల నుంచి ఆయన మరణం తర్వాత జరిగిన ఘటనలను కూడా పుస్తకంలో పొందుపర్చారు.

వ్యక్తిగత విషయాలను…..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం అందరికీ తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆయన తెచ్చిన పథకాలను తొలగించలేని పరిస్థితి. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా ప్రజలు ఎలాంటి సేవలందించారన్నది తెలిసిన సంగతే. అయితే ఆయన వ్యక్తిగత విషయాలేంటి? నిజ జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండేవారన్నది విజయమ్మ పుస్తకంలో తెలియజేశారు.

ప్రతి అడుగు వెనుక….

వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి అడుగు వెనక ఉన్న ఆలోచనలను, ఆయన పడ్డ శ్రమనను విజయమ్మ ఈ పుస్తకంలో అనేక సంఘటనలతో సహా వివరించారు. తండ్రిగా, భర్తగా వేర్వేరు పాత్రల్లో వైఎస్ ఎలా ఉండేవారో కళ్లకు కట్టినట్లు పుస్తకంలో చూపించారు విజయమ్మ. ఇంట గెలిచి రచ్చ ను వైఎస్సార్ ఎలా గెలిచారో పుస్తకంలో వివరించారు విజయమ్మ. ఇంట్లో అవసరాలను ఎలా గుర్తించారో, రాష్ట్రంలో ప్రజల అవసరాలను అలాగే గుర్తించారని విజయమ్మ సంఘటనలతో సహా తెలిపారు.

వివాహం.. పిల్లల బాధ్యతలు…..

వైఎస్ తో వివాహం జరిగిన పరిస్థితులు, పేదల డాక్టర్ గా ఆయన ఎలా ఉన్నారు? ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? చిన్న తనంలోనే ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను విజయమ్మ పుస్తకలంలో పొందుపర్చారు. తమ పిల్లల చదువులు, వివాహాల విషయాలనుకూడా ప్రస్తావించారు. ఆయనకున్న దైవ భక్తిని ప్రత్యేకంగా తెలియజెప్పారు. అంతేకాదు పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ ఆయన ఎదుర్కొన్న వత్తిడులను కూడా వివరించారు విజయమ్మ. ఈ పుస్తకానికి ‘‘నాలో… నాతో… వైయస్సార్‌’’ అని పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ఆవిష్కరించనున్నారు.

Tags:    

Similar News