పెద్దావిడ పేరును ఇక వాడరట… ?
ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. తెలుగుదేశం లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా అన్నట్లుగా కధ నడుపుతున్నాయి. కానీ రెండు చోట్లా మేముంటామని చెప్పిన వైసీపీ తెలంగాణాలో దుకాణం [more]
ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. తెలుగుదేశం లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా అన్నట్లుగా కధ నడుపుతున్నాయి. కానీ రెండు చోట్లా మేముంటామని చెప్పిన వైసీపీ తెలంగాణాలో దుకాణం [more]
ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. తెలుగుదేశం లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా అన్నట్లుగా కధ నడుపుతున్నాయి. కానీ రెండు చోట్లా మేముంటామని చెప్పిన వైసీపీ తెలంగాణాలో దుకాణం బంద్ చేసేసింది. ఏపీకి మాత్రమే పరిమితం అయింది. అదే టైమ్ లో జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరే కాదు, జెండా అజెండా అన్నీ సేమ్ టూ సేమ్ తేడా ఏంటి అంటే అక్కడ అన్న ప్రెసిడెంట్ అయితే ఇక్కడ చెల్లెలు ప్రెసిడెంట్. మిగిలిన కధ అంతా షరా మామూలే.
ఆమ్మ ఓటు అటేనా..?
ఇక వైసీపీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్ సతీమణి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వచ్చారు. ఆమె 2012 నుంచి ప్రజా జీవితంలో ఉంటూ అనేక ఎన్నికల సభల్లో ప్రసంగించారు. పార్టీకి ఒక స్టార్ కాంపెయినర్ గా ఉంటున్నారు. అటువంటి విజయమ్మ ఇపుడు కుమార్తె ఏర్పాటు చేసిన వైఎస్సార్ టీపీలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆమె పార్టీ సన్నాహాల నుంచి ఏర్పాటు వరకూ షర్మిల వెన్నంటి ఉన్నారు. మరి ఆమె టెక్నికల్ గా వైసీపీ హానరరీ ప్రెసిడెంట్. మరి అలా ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీలో కీలక పాత్ర పోషించవచ్చా అంటే కాదనే చెప్పాలి. కానీ జగన్ ఫ్యామిలీకి ఆమె పెద్ద దిక్కు కాబట్టి అలా ఇద్దరి వైపూ ఉన్నారని అనుకున్నా కూడా రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం తప్పే అవుతుంది.
భారీ కుదుపే …?
వైసీపీకి వైఎస్సార్ అసలైన రాజకీయ పెట్టుబడి. ఆయన రక్తం కాబట్టే జగన్, షర్మిలను జనం ఆదరించారు. ఇక ఆయనలో సగభాగంగా విజయమ్మ ఉన్నారు. ఆమెలో వైఎస్సార్ ని చూసుకునే వారు కోట్లాదిమంది ఉన్నారు. ఇపుడు ఆమె షర్మిల వైపు వెళ్తే కచ్చితంగా జగన్ పార్టీకి కొత్త గౌరవ అధ్యక్షుడు రావాల్సిందే. ఒకే వ్యక్తి అటూ ఇటూ ఉండలేరు. దీని మీదనే రఘురామ క్రిష్ణంరాజు లా పాయింట్ కూడా తీశారు. పార్టీ లైన్ దాటిన విజయమ్మ మీద చర్యలేవీ అంటూ హూంకరించారు కూడా. నిజానికి ఆమె ప్లేస్ లో ఎవరైనా ఈ పని చేస్తే జగన్ ఈపాటికే పార్టీ నుంచి బహిష్కరించేవారే. కానీ ఇక్కడ తల్లిగా ఆమె ఉన్నారు. పైగా ఆమె వైఎస్సార్ సతీమణి కూడా.
జగనే సర్వం ..?
అయితే దీని మీద వైసీపీలో వినిపిస్తున్న మాట ఏంటి అంటే విజయమ్మను గౌరవ అధ్యక్షురాలిగా అలాగే ఇప్పటికైతే ఉంచుతారు. కానీ ఆ పేరుని ఇక మీదట పెద్దగా వాడరు. వైసీపీలో జగనే సర్వం సహాగా రానున్న రోజులలో ఉంటారు. పార్టీ ప్రకటనలో కానీ పార్టీ రాజ్యాంగంలో కానీ ఇకమీదట ఆమె పేరు అంతగా కనిపించపోవచ్చునని అంటున్నారు. అయితే ఇవన్నీ తేలాలి అంటే వైసీపీ నిర్వహించే ప్లీనరీలోనే అని కూడా అంటున్నారు. ఇప్పటికి నాలుగేళ్ళుగా వైసీపీ ప్లీనరీ జరగలేదు. నిజానికి ఈ ఏడాది జూలైలో జరగాలి. కానీ కరోనా ఒక వైపు షర్మిల పార్టీ మరో వైపు. దాంతో ఆగింది అంటున్నారు. కానీ తొందరలోనే ప్లీనరీ నిర్వహిస్తారట. అపుడు గౌరవ అధ్యక్ష పదవి మీద కీలకమైన నిర్ణయమే తీసుకోవచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.