Breaking : వివేకా హత్యకు గల కారణాలు అవే… అందుకే చంపారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు గల కారణాలు వెల్లడవుతున్నాయి. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. బెంగుళూరు ల్యాండ్ వివాదంలో [more]

Update: 2021-11-13 14:31 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు గల కారణాలు వెల్లడవుతున్నాయి. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. బెంగుళూరు ల్యాండ్ వివాదంలో తనకు వాటా ఇవ్వలేదని గంగిరెడ్డి వివేకా హత్యకు ప్లాన్ చేసినట్లు దస్తగిరి తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఈ హత్యకు పాల్పడనట్లు దస్తగిరి తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. వివేకా బెడ్ రూంలో ఆర్థిక లావాదేవీల గురించి కూడా వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు.

కుక్కను కారుతో తొక్కించి చంపి…

సునీల్ యాదవ్ వివేకాపై ఏడు నుంచి ఎనిమిది సార్లు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మోసం చేశారని వైఎస్ వివేకానందరెడ్డి ఎర్రగంగిరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచే వారి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకా ఇంటి వద్ద ఉన్న కుక్కను కారుతో తొక్కి చంపారని కూడా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డితో కూడా వివేకా వాగ్వాదానికి దిగారని దస్తగిరి తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. వివేకాను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తామని గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అడ్వాన్స్ కింద తనకు 25 లక్షలు ముట్టాయని, మిగిలిన 75 లక్షలు తన స్నేహితుడు మున్నా దగ్గర దాచి పెట్టానని దస్తగిరి తెలిపారు.

Tags:    

Similar News