వారికి హరి లేని లోటు … ?

విశాఖ సిటీ రాజకీయాల్లో ఇపుడు చాలా వైసీపీ బలంగా కనిపిస్తోంది. మేయర్ ఆ పార్టీ నుంచే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. ఇక పదవులు అన్నీ [more]

Update: 2021-06-09 12:30 GMT

విశాఖ సిటీ రాజకీయాల్లో ఇపుడు చాలా వైసీపీ బలంగా కనిపిస్తోంది. మేయర్ ఆ పార్టీ నుంచే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. ఇక పదవులు అన్నీ కూడా వైసీపీకే ఉన్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ఏం చేసినా రిటార్ట్ ఇచ్చే నేతలు విపక్షంలో లేకుండా పోతున్నారు. తెలుగుదేశానికి నేతలు లేక కాదు కానీ వారి రాజకీయ లెక్కలు వేరేగా ఉండడంతో అధికార పార్టీ మీద విమర్శలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే విశాఖ హోల్ మొత్తానికి మకుటం లేని మజారాజుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారం చలాయిస్తున్నారు.

తెర చాటేనా …?

విశాఖలో అతి పెద్ద జలాశయం ఉంది. ముడసర్లోవ జలాశయం నుంచే విశాఖ వాసులకు మంచి నీరు లభిస్తుంది. ఈ జలాశయం చుట్టూ 70 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఈ భూములలో అందమైన పార్కుని నిర్మించాలని వైసీపీ తాజాగా నిర్ణయించింది. పీపీపీ విధానంలో వీటి నిర్మాణాన్ని తలపెట్టాలని కూడా ఆలోచిస్తోంది. అయితే పేరుకు పార్కు నిర్మాణం కానీ వందల కోట్ల విలువైన భూముల మీదనే వైసీపీ నేతలు కన్ను వేశారని టీడీపీ అంటోంది. కానీ టీడీపీ మాత్రం గట్టిగా దీని మీద పోరాడలేకపోతుంది.

జనసేనతో …?

మధ్యలో జనసేన నాయకులను అడ్డుపెట్టుకుని టీడీపీ వేస్తున్న ఈ బాణాలు వైసీపీకి ఏ మాత్రం తగలడంలేదు. నిజానికి పార్కు నిర్మాణం అంటే విశాఖ అభివృద్ధిలో భాగమే. అయితే ఈ ప్రాజెక్ట్ వెనక ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని బయటపెట్టేందుకు టీడీపీ నాయకులకు ధైర్యం ఏ మాత్రం సరిపోవడంలేదుట. ఎందుకంటే గతంలో ఆ భూముల మీద తమ్ముళ్ళ కన్ను ఉందిట. మరిపుడు వైసీపీది రాజ్యం కాబట్టి వారు అక్కడ డెవలప్మెంట్ అంటూంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని అధికార పార్టీ అంటోంది.

హరి ఉంటేనా…?

మరి ఇలాంటి విషయంలో మాజీ ఎంపీ సబ్బం హరి రూటే సెపరేట్. ఆయన అదురూ బెదురూ లేకుండా వైసీపీ మీద విమర్శలకు దిగిపోయేవారు. ఆయన పక్కా లోకల్ కావడంతో ఆ సెంటిమెంట్ ని జోడించి మరీ చేసే విమర్శలకు పదును ఎక్కువగా ఉండేది. దాంతో పాటు జనాలు కూడా నమ్మే వీలుండేది. ఆయన కేసులకు భయపడే రకం కాదు, పైగా ఎంతకైనా రెడీ అనే తీరు హరిది. దాంతో హరి విశాఖ సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి వరకూ జగన్ నుంచి విజయసాయిరెడ్డి దాకా ప్రతి నిత్యం విరుచుకుపడుతూండేవారు. ఆయన నోటి ధాటికి ధీటుగా బదులిచ్చే పరిస్థితి కూడా ఎవరికీ ఉండేది కాదు. ఇపుడు విశాఖలో ఉన్న వాళ్ళంతా వలస నేతలే. ఎవరి లోగుట్టు వారికి ఉంది. దాంతో ఏ మాట అంటే ఏం జరుగుతుందో అని టీడీపీ నేతలు గమ్ముంటున్నారు. మొత్తానికి టీడీపీకి మాత్రం విశాఖ సిటీలో బలమైన గొంతుకగా ఉన్న హరి అంతర్ధానం కావడం పెద్ద షాక్ గానే ఉందిట.

Tags:    

Similar News