Ycp : 2009 రిజల్ట్ రిపీట్ అట… సింగిల్ గానే బరిలోకి?

పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా అయింది. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో చతికల పడ్డాయి. వీరిని చూసే జనం ఓట్లేసే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో [more]

Update: 2021-10-09 02:00 GMT

పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా అయింది. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో చతికల పడ్డాయి. వీరిని చూసే జనం ఓట్లేసే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న హైకమాండ్ చెప్పినట్లు ఆడే పార్టీలకు ఇక్కడ స్థానం లేదని తెలుగు ప్రజలు తమ తీర్పు ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే జాతీయ పార్టీలు తమిళనాడు తరహాలో ఏపీలో పొత్తులు ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పెట్టుకోవాల్సిందే. వచ్చే 2024 ఎన్నికలు కూడా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నది వాస్తవం.

మరో కూటమి ఏర్పాటుకు….

అయితే వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించాలంటే మరోసారి కూటమి ఏర్పాటు చేయడం తప్పదన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకే ఇప్పటి నుంచే అన్ని పార్టీలను తన దరి చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకటి మాత్రం నిజం. ఈసారి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయరు. ఈ విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే వైసీపీ నేతలు ఇప్పుడు సవాల్ విసురుతున్నారు.

సింగిల్ గానే వచ్చి….

వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే వస్తామని చెబుతున్నారు. పొత్తు అనేది తమ డిక్షనరీ లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అది అనాదిగా వస్తున్న ఆచారమేనని చెబుతున్నారు. 2009 పొత్తులను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తారనడానికి ఆ ఎన్నికలే నిదర్శనమని చెబుతున్నారు. 2009లో వైఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు మహాకూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయినా ఆ ఎన్నికల్లో మహాకూటమికి విజయం దక్కలేదు.

సంక్షేమ పథకాలనే….

ఇప్పుడు కూడా అంతేనంటున్నారు. 2009లో టీఆర్ఎస్ వంటి పార్టీ ఉన్నా చంద్రబాబును ప్రజలు పట్టించుకోలేదని, వైఎస్ సంక్షేమ పథకాలనే చూశారంటున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి పోటీ చేసినా ప్రజలు తమనే ఆదరిస్తారని, సంక్షేమానికే ఓటేస్తారని, చంద్రబాబుకు 2009 ఎన్నికల ఫలితాలు విభజన ఏపీలో కూడా రిపీట్ కాక తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందరూ కలసి వచ్చినా తమకు ఇబ్బంది లేదని సవాళ్లు విసురుతున్నారు. తాము మాత్రం ఒంటరిగానే సింహంలా బరిలోకి దిగుతామని చెబుతున్నారు.

Tags:    

Similar News