జగన్ పార్టీ వైపు ఎందుకు చూడటం లేదు?

జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తుంది. మరో మూడేళ్ల పాటు జగన్ అధికారంలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. అయితే [more]

Update: 2021-06-20 00:30 GMT

జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తుంది. మరో మూడేళ్ల పాటు జగన్ అధికారంలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. అయితే ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ లో చేరికలు ఎలా ఉండాలి? కానీ ఆ ఊసే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో గత కొద్ది నెలలుగా చేరికలు లేవు. ఎవరూ ఆ పార్టీవైపు చూడటం లేదు. దీనికి కారణాలపై వైసీపీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అధికారంలోకి వచ్చిన…?

జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. వల్లభనేని వంశీతో ప్రారంభమై ఆ తర్వాత మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసీపీకి అండగా నిలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎవరూ చేరలేదు. వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం లేదు. ప్రస్తుతమున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇక పార్టీని వీడే అవకాశం లేదని తెలుస్తోంది.

మూడేళ్ల సమయం ఉన్నా…?

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ వైసీపీలో చేరేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఒకవేళ జగన్ ను నమ్ముకుని పార్టీలో చేరినా తగినంత ప్రయారిటీ దక్కదన్నది ఒక కారణం కాగా, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమేనన్న ఆలోచనతో పార్టీ మారేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఫెయిలయిందంటున్నారు.

ద్వితీయ శ్రేణి నేతలు కూడా?

ఇక ఎమ్మెల్యేలను పక్కన పెడితే కొద్దో గొప్పో పేరున్న నేతలు కూడా ఇటీవల కాలంలో వైసీపీ లో చేరడం లేదు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత చేరికలు ఆగిపోయాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ, నియోజకవర్గాల్లో మాత్రం గ్రూపుల బలపడిపోయాయని అంటున్నారు. అందుకోసమే వైసీపీలో చేరికలు ఇటీవల కాలంలో నిలిచిపోయాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

Tags:    

Similar News