అరకు వైసీపీ ఎంపీ తర్వాత ఈమె కాదట… ?
వైసీపీ వ్యూహం పదును తేరుతోంది. రెండేళ్లకు పైగా పాలన పూర్తి అవుతోంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల కోసం కూడా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో [more]
వైసీపీ వ్యూహం పదును తేరుతోంది. రెండేళ్లకు పైగా పాలన పూర్తి అవుతోంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల కోసం కూడా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో [more]
వైసీపీ వ్యూహం పదును తేరుతోంది. రెండేళ్లకు పైగా పాలన పూర్తి అవుతోంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల కోసం కూడా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో కొంతమందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి ఆ దిశగా వారిని ప్రిపేర్ చేస్తున్నారు అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇపుడు కొత్త ముఖాన్ని జగన్ ముందుకు తెస్తున్నారు. ఆమె రాజకీయాలకు కొత్త కాదు కానీ వైసీపీ కి మాత్రం కొత్త అనే చెప్పాలి. ఆమె పేరు స్వాతిరాణి, టీడీపీలో ఆమె మాతృమూర్తి శోభా హైమావతి ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఇక స్వాతిరాణి కూడా విజయనగరం జిల్లాపరిషత్ చైర్ పర్సన్ గా సేవలు అందించారు.
జీసీసీ పీఠం…?
ఏపీలో అత్యంత ప్రతిష్టాతకమైన జీసీసీ చైర్ పర్సన్ పీఠాన్ని స్వాతీరాణికి వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. స్వాతి పార్టీలో కొద్ది నెలల క్రితమే చేరారు. కానీ ఆమెకు కీలకమైన పదవిని అప్పగించడం వెనక వైసీపీ వ్యూహాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. స్వాతిరాణి కుటుంబం జిల్లాలో రాజకీయంగా కూడా పట్టున్నది కావడంతో ఆమెను జిల్లాలో ముందుంచి పాలిటిక్స్ నడపాలని కూడా వైసీపీ ప్లాన్ చేస్తోంది. లాభాల బాటలో ఉన్న జీసీసీ పీఠాన్ని అప్పగించడం ద్వారా స్వాతిరాణిని సక్సెస్ ఫుల్ లీడర్ గా చూపించాలన్న ప్రయత్నం కూడా సాగుతోందిట.
అరకు ఎంపీగా ..?
ఇక స్వాతీరాణి 2019 ఎన్నికల వేళ టీడీపీ నుంచి అరకు ఎంపీ సీటుని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం సాలూరుకి చెందిన గుమ్మడి సంధ్యారాణికి దాన్ని కేటాయించారు. నిజానికి స్వాతీరాణికి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ తరువాత టీడీపీ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. దాంతో తమ రాజకీయం అక్కడ ముగిసింది అనే తల్లి శోభారాణితో పాటు స్వాతి కూడా భావించారు అని చెబుతారు. హైమావతి అయితే రిటైర్ అయిపోయారు. స్వాతి యువ నాయకురాలు కావడంతో తల్లి సలహా మేరకే వైసీపీలోకి వచ్చారు అంటున్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి పోటీకి దింపడానికి వైసీపీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది అంటున్నారు.
టీడీపీకి గట్టి దెబ్బ …?
ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని వచ్చేసారి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని టాక్ ఉంది. దాంతో స్వాతీరాణికి లైన్ క్లియర్ అయినట్లే అని చెబుతున్నారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన వారికి సముచితమైన స్థానం కల్పిస్తామన్న సందేశాన్ని కూడా వైసీపీ ఈ విధంగా పంపుతోంది అంటున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని బలమైన నేతలు, సీనియర్లు టీడీపీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. ఇపుడు ఎస్టీ, ఎస్సీ వర్గాల వారు కూడా పార్టీ నుంచి జారిపోవడం అంటే కచ్చితంగా అది జిల్లాలో పార్టీకి తీరని నష్టం చేస్తుందనే అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో మరింతమంది టీడీపీ లీడర్లను కూడా లాగేయడం ద్వారా ఎన్నికల కంటే ముందే సైకిల్ ని షెడ్డుకు పంపాలన్నదే వైసీపీ టర్గెట్ అంటున్నారు.